ఎయిర్ ఇండియా ప్రయాణికులకు రతన్ టాటా స్పెషల్ మెసేజ్!

Update: 2022-02-03 05:56 GMT
రతన్ టాటా.. భారత పారిశ్రామిక వర్గాల్లో ఈ పేరు తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. కేవలం పారిశ్రామికవేత్త గా మాత్రమే గాక వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలతో కూడా ఈయన చాలా మందికి సుపరిచితులు. ఈయన సంస్థ అయిన టాటా గ్రూప్ అడుగు పెట్టని రంగం అంటూ ఏదీ లేదు అని చెప్పాలి. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్, మ్యూట్యూవల్ ఫండ్స్, టెలికాం, గోల్డ్, సాఫ్ట్ వేర్, హోటల్, రిటైల్ ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో తోడ్పడుతుంది ఈ గ్రూప్. కేవలం ఒక్క పైన చెప్పిన రంగంలో మాత్రమే గాక.. ఇంకా చాలా రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. వాటిలో ఒకటి విమానయానం. అంటే ఎయిర్ లైన్స్ ను కూడా ఈ గ్రూప్ స్థాపించింది. ఇప్పటికే ఎమిరేట్స్ పేరుతో విమానాలను నడుపుతుంది.

తాజాగా ఈ గ్రూప్ లోకి మరో సంస్థ వచ్చి చేరింది. అదే ఎయిర్ ఇండియా. ఈ సంస్థ  గతంలో టాటా గ్రూప్ దే. అయితే కొన్ని కారణాల వల్ల అది ప్రభుత్వ సంస్థ గా 69 ఏళ్ల క్రితం మారింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా తీవ్రంగా అప్పుల పాలు కావడం వల్ల చేసేది ఏమీ లేక ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం వదిలించుకోవాలి అనుకుంది. దీంతో బిడ్ వేయగా రంగంలోకి దిగిన టాటా గ్రూప్ ఈ సంస్థను సొంతం చేసుకుంది. ఇటీవల సంస్థను టాటా గ్రూప్ కి అప్పగించింది కేంద్రం.

అయితే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ప్రయాణికులకు ఎయిర్ ఇండియాపై నమ్మకం కలిగించేందుకు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. మార్పును తీసుకు వస్తున్నాం అనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపేందుకు కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా రంగంలోకి దిగారు. ఎయిర్ ఇండియా కొత్త ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నాం అని ఓ వాయిస్ మెసేజ్ ను విడుదల చేశారు. ఆ మెసేజ్ ను ఎయిర్ ఇండియా తన అధికారిక ట్విట్టర్  పేజీ లో యాడ్ చేసి ట్వీట్ చేసింది.  

రతన్ టాటా విడుదల చేసిన ఆ వాయిస్ మెసేజ్ లో ఏముంది అంటే.. టాటా గ్రూప్.. ఎయిర్ ఇండియా కొత్త ప్రయాణికులకు స్వాగతం పలుకుతుంది. మీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇది మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేగాకుండా ఎయిర్ ఇండియా ప్రయాణికుల సౌకర్యం, సేవల విషయంలో రాజీపడకుండా.. విమానయాన రంగం అంటే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా అంటే విమానయాన రంగం అనేలా తీర్చిదిద్దుదాం అని అన్నారు.

జనవరి 27 వ తారీఖున కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిర్ ఇండియా ను టాటా సంస్థ కు అప్పగించింది.

Full ViewFull View
Tags:    

Similar News