ఫాంహౌస్ లో జరిగే పార్టీలు.. హైదరాబాద్ నగర నడిబొడ్డున?

Update: 2020-01-13 04:58 GMT
విచ్చల విడితనానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పే రేవ్ పార్టీ అప్పుడప్పుడు నగర శివారు లోని ఫాంహౌస్ లో గుట్టుగా సాగి పోతూ ఉంటుంది. అలాంటి దరిద్రపు గొట్టు పార్టీని హైదరాబాద్ నగర నడి బొడ్డున ఉన్న ఒక పబ్ లో ఏర్పాటు చేయటం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 10లోని టోట్ పబ్ మీద దాడులు నిర్వహించారు. భారీగా మద్యంతో పాటు.. నగ్నంగా డ్యాన్సులు నిర్వహించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల నుంచి 22 మంది అమ్మాయిల్ని తీసుకొచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు రంగం లోకి దిగారు.

రెండు టీమ్ లుగా మారి.. సదరు పబ్ మీద ఆదివారం రాత్రి పదకొండు గంటల వేళలో దాడులు నిర్వహించారు. వాస్తవానికి ఈ పబ్ మీద ఎక్సైజ్ అధికారులు తొలుత దాడి చేసినప్పటికీ.. తర్వాత పోలీసులు కూడా కలిశారు. ఈ సందర్భంగా పలువురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంపన్నులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జూబ్లీహిల్స్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారాన్ని అందుకున్న అధికారులు ఆకస్మికం గా నిర్వహించిన దాడులు సంచలనంగా మారాయి. ప్రసాద్ అనే ఈవెంట్ మేనేజర్ ప్రైవేటు పార్టీ కోసం ఆదివారం సదరు పబ్ ను బుక్ చేసుకున్నారు. ఈ పార్టీ కోసం పలువురు యువతుల్ని వేర్వేరు రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకొచ్చారు.

ఎక్సైజ్ అధికారులతో పాటు బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. పార్టీ మరో పది నిమిషాల్లో ప్రారంభం కానున్న వేళ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. సదరు రేవ్ పార్టీని భగ్నం చేశారు. పోలీసుల రాకతో పార్టీలోకి పాల్గొనేందుకు వచ్చిన యువకులు పలువురు పారిపోయారు. పార్టీ నిర్వాహకుడు సైతం పోలీసులకు దొరకలేదు. పారిపోయిన వారిని గుర్తించేందుకు వీలుగా సీసీ కెమేరా ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్న యువతులను ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్లపై ఇద్దరు యువతులు దాడులు చేసే ప్రయత్నం చేయగా.. పోలీసులు నిలువరించారు. వారి కెమేరాలు డ్యామేజ్ కాకుండా కాపాడారు. .అంతేనా.. తనిఖీల్ని కవర్ చేస్తున్న పలువురు మీడియా ప్రతినిధులను సదరు యువతులు బండ బూతులు తిట్టేయటం గమనార్హం.  పబ్బుల్లో జరిగే ప్రైవేటు పార్టీలకు అనుమతి తప్పనిసరి అని.. తాజా పార్టీకి సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇళ్ల మధ్య ఇంత ఛండాలం చేయటాన్ని స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. హైదరాబాద్ లో రేవ్ పార్టీలను అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పార్టీ నిర్వాహకుడు తప్పించుకుపోయాడని.. అతన్ని వెతికే పనిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పార్టీలో పట్టుబడిన యువతుల్లో కానీ.. పార్టీకి వచ్చిన వారిలో కానీ మైనర్లు ఎవరైనా ఉన్నారా? అన్న విషయం మీద పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ పార్టీ కి సంబంధించి కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వేర్వేరుగా రిపోర్టు చేయటం గమనార్హం. ఒక ప్రముఖ మీడియా సంస్థ.. ఈ పార్టీ ప్రారంభమైందని.. అప్పటికే 22 మంది యువతులు నగ్నంగా డ్యాన్సులు చేస్తున్నట్లు చెబుతుంటే.. మరో మీడియా సంస్థ మాత్రం పార్టీ ప్రారంభానికి పదినిమిషాల ముందు తనిఖీలు జరిగినట్లు గా పేర్కొంది. మరో మీడియా సంస్థ అయితే.. పార్టీ ప్రారంభమైంది కానీ.. ఎక్కడా ఎలాంటి అశ్లీలత ఆ సమయానికి  లేదన్నట్లుగా కథనాల్ని పబ్లిష్ చేయటంతో ఏది నిజం? అసలేం జరిగితే.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు? అన్న దానిపై స్పష్టత లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News