ఆ బీజేపీ మాజీ మంత్రి కామెడీ చూశారా..!

Update: 2019-12-19 15:37 GMT
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో టీడీపీ - బీజేపీ నేత‌లు త‌మలో తామే త‌లోర‌కంగా మాట్లాడుతూ గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి - బీజేపీ నేత రావెల కిషోర్‌ బాబు సైతం తీవ్రంగా స్పందించారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళ‌న‌లో ఉన్నార‌ని అన్నారు.

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై స్థానికంగా కొంద‌రు రైతులు వెల‌గ‌పూడిలో రిలే దీక్ష‌లు చేస్తున్నారు. ఈ శిబిరాన్ని సంద‌ర్శించిన రావెల అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమిత్ షా పేరు చెపితే జ‌గ‌న్ గుండెళ్లో గుబులు ప‌ట్టుకుంటుంద‌ని కూడా విమ‌ర్శించారు. రావెల చేసిన ఈ తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న పెడితే అస‌లు బీజేపీలోనే రావెల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. అస‌లు ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా రావెల‌ను వాళ్లు లైట్ తీస్కొంటూనే వ‌స్తున్నారు. అస‌లు రావెల మాట‌లు కామెడీకే కామెడీగా మారాయ‌ని ఆ పార్టీ వాళ్లే గుస‌గుస‌లాడుకుంటున్నారు.

టీడీపీలో మంత్రిగా ఉన్న‌ప్పుడే ఆయ‌న్ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఆ త‌ర్వాత జ‌న‌సేన‌లో చేరితే అక్క‌డా గుర్తింపు లేదు. ఇప్పుడు బీజేపీలోనూ అదే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రోవైపు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సైతం రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌పై జ‌గ‌న్ నిర్ణ‌యం స్వాగ‌తిస్తున్న‌ట్టు చెప్పారు. బీజేపీలో సుజ‌నా చౌద‌రి లాంటి వాళ్లు మిన‌హా మ‌రెవ్వ‌రు జ‌గ‌న్ నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు చేసేందుకు కూడా సాహ‌సించ‌డం లేదు.

అలాంటిది పార్టీలో ఉన్నాడో లేదో తెలియ‌ని రావెల ఉనికి కోస‌మే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రోవైపు ఏపీలో జ‌గ‌న్ నిర్ణ‌యానికి అన్ని ప్రాంతాల నుంచి జ‌నామోదం వ‌స్తుండ‌డంతో ఇక్క‌డ టీడీపీ - బీజేపీ ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న ప‌రిస్థితి. అటు కేంద్రం సైతం జ‌గ‌న్ దూకుడు చూసి వెన‌కా ముందు ఆలోచ‌నలో ప‌డింది. ఏపీలో నిన్న‌టి వ‌ర‌కు దూకుడుగా వెళ్లాల‌నుకున్న బీజేపీకి జ‌గ‌న్ నిర్ణ‌యాలు కొర‌క‌రాని కొయ్య మాద‌రిగా మారాయి. ఇలాంటి టైంలో సుజ‌నా వ్యాఖ్య‌ల‌కే దిక్కులేదు... మ‌రి రావెల వ్యాఖ్య‌లు ఎవ‌రైనా చూస్తారా ? ప‌ట్టించుకుంటారా..?


Tags:    

Similar News