ఒక వివాహిత మహిళను తన కొడుకు వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. తన కొడుకు కారు ముందు కుక్కపిల్ల రావటంతో.. ఆపి కిందకు దిగితే.. సదరు మహిళ తప్పుగా అర్థం చేసుకుందన్న వాదనను తొలుత వినిపించారు. అనంతరం.. ఈ ఉదంతానికి సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ వీడియో ఫుటేజ్ లో రావెల కారు వెళుతుండగా విశాలమైన రోడ్డు కనిపిస్తుందే తప్పించి కారు ముందు భాగంగా కుక్కపిల్ల అన్నది కనిపించదు. వేగంగా వెళ్లకుండా స్లోగా వెళ్లటం.. కారు నెమ్మదించటం.. వివాహిత మహిళ కారును చూసి వడివడిగా ముందుకు వెళ్లటం..కాస్త దూరం జరగటం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే.. దీనికి భిన్నంగా కారు ముందు కుక్కపిల్ల రావటంతో తప్పించేందుకు కిందకు దిగినట్లుగా రావెల తొలుత చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న పలువురు.. కారు ముందు కుక్క పిల్ల లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నేరం జరిగిందన్న ఆరోపణ వచ్చినప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న విషయాన్ని రావెల మర్చిపోయినట్లు కనిపిస్తుందే. ఎందుకైనా మంచిది.. ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే వరకూ రావెల సైలెంట్ గా ఉండే మంచిదేమో..?