పలు నేరారోపణలతో పీకల్లోతుల్లోకి కూరుకుపోయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణను ఎదుర్కొంటున్నారు. పలు నేరారోపణల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు జరిపిన విచారణకు మూడు రోజుల పాటు వెళ్లిన రవిప్రకాశ్.. టీవీ9 లోగో విక్రయానికి సంబంధించిన నమోదైన కేసు విచారణకు ఈ రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.
సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణ సందర్భంగా రవిప్రకాశ్ ఏ తీరులో వ్యవహరించారో.. తాజాగా అలాంటి వ్యవహారశైలినే ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. టీవీ9 లోగోను ఎందుకు విక్రయించారు? ఈ విక్రయం అక్రమమని తెలీదా? ఎలా విక్రయిస్తారు? లాంటి పలు ప్రశ్నలను సంధించగా.. రవిప్రకాశ్ పెద్దగా స్పందించలేదని చెబుతున్నారు.
ఎప్పటిలానే తనదైన రీతిలో మౌనంగా ఉండటం.. పొంతన లేని సమాధానాలు చెప్పటంతో పాటు.. తన మీద ఆరోపణల్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజా విచారణతో ఎలాంటి ప్రయోజనం లేదన్న మాట పోలీసులు తమ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. సైబరాబాద్ పోలీసుల విచారణలో ఏ రీతిలో అయితే సహకరించలేదో.. తాజాగా అలాంటి తీరునే రవిప్రకాశ్ ప్రదర్శిస్తారని.. దీన్ని కారణంగా చూపి ఆయన్ను ఈ రోజు అరెస్ట్ చేయటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.