మెరుగైన సమాజం అంటూ గొప్పలు చెప్పుకుంటూ.. ఏళ్లకు ఏళ్లుగా టీవీ9 చానల్ నడిపేసిన ఆ చానల్ మాజీ సీఈవో నిన్న కోర్టులో భయంకరమైన నిజాన్ని చెప్పుకొచ్చారు. టీవీ9 ఏర్పాటు సమయంలో మారిషస్ నుంచి ఫెమా రూల్స్ కు విరుద్ధంగా రూ.60 కోట్ల నిధులు వచ్చాయని పేర్కొన్నారు.
టీవీ ఆరంభంలోనే లెక్క తేడా ఉన్నప్పుడు.. ముందు ఆ దుర్మార్గం మీద పోరాడాల్సిన రవిప్రకాశ్ ఇంతకాలం ఎందుకా విషయాన్ని బయపెట్టలేదు. పాపిష్టి డబ్బుతో పెట్టిన చానల్ నిత్యం నీతులు చెబుతూ.. ఎదుటోడి తప్పుల్ని ఎత్తి చూపించే వైనం చూస్తే.. రవిప్రకాశ్ అసలు రంగు ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.
ఇన్నేళ్లుగా దాచిన నిజాన్ని.. తాజాగా ఎందుకు బయటపెట్టారన్నది ఆసక్తికరం. టీవీ9 చానల్ ప్రారంభంలో ఎలా అయితే అక్రమ పద్దతిలో డబ్బులు వచ్చాయో.. తాజాగా చేతులు మారిన సందర్భంలోనూ వచ్చాయని చెప్పుకొచ్చారు. దీనిబట్టి చూస్తే.. చానల్ ఆరంభమే లెక్క తేడా అన్న విషయాన్ని రవిప్రకాశే స్వయంగా చెప్పినట్లు.
మరింతకాలం పెద్ద మనిషిగా చెలామణి అయి.. నోరు విప్పితే చాలు నీతులు చెప్పే ఆయన.. దుర్మార్గ పద్దతిలో డబ్బులు వచ్చిన విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబితే బాగుంటుంది. నిత్యం ఎదుటోళ్లలో తప్పులు వెతికే రవిలాంటి పెద్ద మనిషి అసలు రూపం తాజా ఎపిసోడ్ తో బయటకు వచ్చిందని చెప్పక తప్పదు.