ఎన్ ఆర్ ఐల నుంచి - టీవీ నైన్ పేరుతో దాతల నుంచి భారీగా నిధులు వసూలు చేసి ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించిన ఆసుపత్రి సిలికానాంధ్రా హాస్పిటల్. కూచిపూడిలో ఈ ఆసుపత్రిని కొన్నేళ్ల కిందట ప్రారంభించారు. ఆ ఆసుపత్రి పేరుతో రవి ప్రకాష్ దాదాపు యాభై కోట్ల రూపాయల చందాలను వసూలు చేసినట్టుగా అంచనా. టీవీ నైన్ సీఈవో అనే హోదాలో అప్పుడు ఆ చానల్ ను ఉపయోగించుకుని రవి ప్రకాష్ భారీగా చందాలు వసూలు చేశారట. ఆ ఆసుపత్రిని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేత - రవి ప్రకాష్ సొంత సామాజికవర్గం ప్రముఖుల చేత ప్రారంభింపజేశారు.
ఆ సమయంలో చాలా కబుర్లే చెప్పారు. ఆ ఆసుపత్రికి అంతర్జాతీయ వైద్యులు వస్తారని, అమెరికా నుంచి వైద్యులు క్యూ కడతారని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రకటన చేశారు. అదంతా దాతల నుంచి వసూళ్లు చేసుకోవడానికే అనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు కూచిపూడి గ్రామస్తుల నుంచి ఆ ఆసుపత్రిలో సేవలు అద్వాన్నంగా ఉన్నాయని సమాచారం. అంతే కాదు..తాజాగా అక్కడ ఒక పేషెంట్ అనుమానాస్పద పరిస్థితిల్లో మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో అక్కడకు వచ్చిన ఒక వ్యక్తికి సరైన వైద్య సదుపాయాలు అందిచలేదని - ఆ పేషెంట్ బంధువులు ఆరోపిస్తున్నారు. కనీసం ఆక్సిజన్ అందించలేదని - ఆ సౌకర్యం కూడా లేకుండా చేసి తమ వ్యక్తి మరణానికి కారణం అయ్యారని ఆసుపత్రి మీద వారు ఆరోపిస్తూ ఉన్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో వారిని పిలిపించుకుని మ్యాటర్ ను సెటిల్ చేసుకున్నారట. భారీగా డబ్బులు ఇచ్చి వారిని సైలెంట్ చేశారని - స్థానిక మీడియాను కూడా మేనేజ్ చేశారని తెలుస్తోంది. అంతర్జాతీయ వైద్యులు అని చెప్పి.. చివరకు కనీసం హైదరాబాద్ స్థాయి వైద్యులను కూడా అక్కడ అందుబాటులో ఉంచలేదట. డాక్టర్లు - నర్సులు అంతా కలిసి ముప్పై మంది సిబ్బందితో నడుపుతున్నారని సమాచారం. చందాలేమో యాభై కోట్ల రూపాయల వరకూ వసూలు చేశారట - ఇటీవల కూడా టీవీ నైన్ పేరు చెప్పుకుని రవి ప్రకాష్ ఆ ఆసుపత్రికి చందాలను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.
ఆసుపత్రికి కనీస సౌకర్యాలు కూడా సమకూర్చుకుండా - అక్కడ వైద్య సేవలకు బ్రేకులు వేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు కూడా ఈ ఆసుపత్రిపై విశ్వాసం కోల్పోయారని తెలుస్తోంది.