జనం సొమ్మును 'క్యాష్' చేసుకున్న రవి ప్రకాష్?

Update: 2019-11-01 12:56 GMT
టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కూచిపూడిలో నడుస్తున్న సంజీవని ఆసుపత్రిపై వైద్యశాఖ అధికారులు విచారణ మొదలయినట్టుగా తెలుస్తూ ఉంది. రవి ప్రకాష్ ఆసుపత్రి సొమ్మును క్యాష్ చేసుకున్నట్టుగా వార్తలు  వస్తున్నాయి. ఆసుపత్రికి నిధులను సేకరించి - వాటిని సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు రవి ప్రకాష్.

సంజీవని ఆసుపత్రి పేరుతో  జోలె పట్టి మరీ వసూళ్ళు చేసిన జనం సొమ్ములను కూడా రవి ప్రకాష్ తన సొంత ఖాతాలలో  మల్లించారనే ఆరోపణలు  గుప్పుమంటున్నాయి. రోగాలొస్తే అటు విజయవాడ - ఇటు మచిలీపట్నం వరకు వెళ్లడానికి నరకయాతన పడుతున్న తమ దగ్గరకు ఇంటి ముందే ఉచిత వైద్యం అందిస్తామని రవిప్రకాష్ - కూచిబొట్ల  చెప్పిన మురుగు మాటలు ఇప్పటికి తమకు గుర్తున్నాయని స్థానికులు విచారణ కు వెళ్లిన అధికారుల ముందు గోడు వెళ్లబోసుకుట్టు సమాచారం.

కూచిపూడి లో నిర్మించే రవిప్రకాష్ సంజీవని ఆసుపత్రికి లక్షకు పైగా దానం చేసిన దాత కు వారి కుటుంబ సభ్యులకు ఇదే ఆసుపత్రిలో జీవితకాలం పాటు అమెరికా స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని కూచిపూడి కి చుట్టుపక్కల వున్న  వారివద్ద రవిప్రకాష్ బ్యాచ్ ఆసుపత్రి కోసం లక్షల్లో వసూలు చేసారని  అధికారుల విచారణలో తేలినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.

అమెరికా నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ లను తీసుకొచ్చి ఉచిత వైద్యం అందిస్తామని చెప్పిన హామీలు ఇప్పుడేవి రవిప్రకాష్ సంజీవని ఆసుపత్రి లో మచ్చుకైనా కనిపించడం లేదని - కూచిబొట్ల ఆనంద్ అమెరికా కథలు - రవిప్రకాష్ సమాజ సూక్తులు విని మోసపోయామని తెలుసుకుంటున్న దాతలు - జోలె విరాళాలకు చేయందించిన స్థానికులు ఇప్పుడు రవిప్రకాష్ బృందం చేసిన మోసానికి విస్తుపోతున్నట్టుగా భోగట్టా.

ఫోర్జరీ కేసులు - నిధుల మళ్లింపు కేసులో రవిప్రకాష్ అరెస్ట్ కావడం తో  సంజీవని ఆసుపత్రి కోసం సేకరించిన విరాళాలను కూడా రవిప్రకాష్ - కూచిబొట్ల ఆనంద్ స్వాహా చేసారని  ఆందోళన దాతల్లో నెలకొన్నట్టుగా తెలుస్తోంది.




Tags:    

Similar News