తెలుగు రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు విభజన ఇప్పట్లో తేలే వ్యవహారం కాదనట్లుగా కనిపిస్తోంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ హైకోర్టు విభజనపై కోర్టులో పలు కేసులు దాఖలయ్యాయని తెలిపారు. పలుచోట్ల స్టేలు అమలులో ఉన్నందున విభజన వ్యవహారం ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదన్నారు. హైకోర్టు విభజన వ్యవహారం కేసుల మూలంగా అత్యంత వివాదాస్పదంగా తయారైందని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. భవనాలు - మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉంటే నూతన హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమేనని ఆయన చెప్పారు.
కొత్త హైకోర్టును ఏర్పాటు చేసేందుకు మంచి వసతి - సదుపాయాలు ఉండటం ఎంతో అవసరమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఫెసిలిటేటర్ గా వ్యవహరిస్తుంది తప్ప ఇతరత్రా కాదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు - కే చంద్రశేఖర్ రావుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనాలన్నది కేంద్ర ప్రభుత్వం అభిమతమని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. భవన సదుపాయం, మౌలిక సదుపాయాలు లేకుండా కొత్త హైకోర్టును ఏర్పాటు చేయటం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు రాష్ర్టాలు సమన్వయం, సంయమనంతో వ్యవహరించాలని కేంద్ర మంత్రి సూచించారు.
తెలుగు రాష్ర్టాల మధ్య సుహృద్భావ రీతిలో సమస్యలు పరిష్కారం కావాలనేది కేంద్ర ప్రభుత్వం భావన అని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం చర్చలు, భవిష్యత్ అవసరాలు, అవగాహనతో ముందుకు సాగడం వంటి అంశాల ఆధారంగా ఇరు రాష్ర్టాల మధ్య సంబంధాలు కొనసాగడం మంచిదని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/