డ్రగ్స్ విచారణకు హాజరైన సినీ ప్రముఖులకు భిన్నమైన రీతిలో హీరో రవితేజ మాజీ డ్రైవర్ శ్రీనివాసరావు ఎపిసోడ్ సాగినట్లుగా చెప్పాలి. డ్రగ్స్ కేసుకు సంబంధించిన సినీ ప్రముఖుల్ని గంటల కొద్దీ విచారించిన అధికారులు రవితేజ మాజీ డ్రైవర్ ను చాలా పరిమిత సమయం మాత్రమే విచారించినట్లుగా చెప్పాలి.
అంతేనా.. విచారణకు హాజరైన శ్రీనివాసరావు వైనం మొదలు అతడి విచారణ సాగిన వైనం వరకూ అంతా భిన్నమైన రీతిలో సాగినట్లుగా తెలుస్తోంది. విచారణ సందర్భంగా సినీ ప్రముఖులు హాజరైన వేళలో కనిపించిన హడావుడి ఏదీ రవితేజ మాజీ డ్రైవర్ శ్రీనివాసరావు విచారణ వేళలో చోటు చేసుకోలేదని చెప్పాలి. విచారణ సమయానికి ముందే వచ్చిన సినీ ప్రముఖులకు భిన్నంగా రవితేజ మాజీ డ్రైవర్ మాత్రం ఉదయం 10.30 గంటలకు అబార్కీ కార్యాలయానికి రావటం గమనార్హం.
అంతేనా.. మిగిలిన వారి మాదిరి పెద్ద పెద్ద కార్లలో కాకుండా.. బైక్ మీద వచ్చాడు. నేరుగా విచారణకు వెళ్లిన అతడ్ని అధికారులు సైతం చాలా స్వల్ప వ్యవధి మాత్రమే విచారించారు. ఇప్పటివరకూ విచారణ ఎదుర్కొన్న వారిలో అత్యంత తక్కువ సమయం విచారణ ఎదుర్కొన్న వ్యక్తిగా రవితేజ మాజీ డ్రైవర్ ను చెప్పాలి.
కేవలం మూడు గంటలు మాత్రమే అధికారులు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా రక్త నమూనాలు.. గోళ్లు లాంటి కూడా అడగలేదని తెలుస్తోంది. రవితేజకు మీరు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా ఆధారాలు ఉన్నట్లుగా అధికారులు ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ఎవరి దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నారంటూ ప్రశ్నించిన అధికారులకు.. తాను ఎప్పుడూ డ్రగ్స్ ను ఇవ్వలేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
కేవలం తాను డ్రైవర్ గా మాత్రమే బాధ్యతలు నిర్వర్తించానే తప్పించి రవితేజతో తనకు మరెలాంటి సంబంధం లేదని చెప్పారని అంటున్నారు. మరి.. జీశాన్ కు ఎందుకు పదే పదే ఫోన్లు చేశావు? జీశాన్ ను నీకు పరిచయం చేసింది ఎవరు? ఎందుకు పరిచయం అయ్యాడు? అన్న ప్రశ్నల్ని సంధించగా.. అసలు జీశాన్ ఎవరో తనకు తెలీదని రవితేజ మాజీ డ్రైవర్ శ్రీనివాసరావు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.
రవితేజ సోదరుడు భరత్ తో తాను ఎప్పుడూ తిరగలేదని స్పష్టం చేయటంతో పాటు.. తన ఫోన్ నెంబరును తానే వాడుతున్నానని.. ఎవరికి ఇవ్వలేదని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఉదయం 10.30 గంటలకు మొదలైన విచారణ మధ్యాహ్నం 1.30 గంటలకు పూర్తి అయ్యింది. రవితేజ మాజీ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని కూడా అధికారులు విచారించినట్లుగా చెబుతున్నారు. డ్రగ్స్ విచారణ ఎపిసోడ్ లో ఇప్పటివరకూ తొమ్మిది మంది విచారణ పూర్తి అయ్యింది. సోమవారం వర్థమాన హీరో తనీశ్ ను అధికారులు విచారించనున్నారు. మరీ.. సందర్భంగా ఎన్ని గంటలు అధికారులు విచారిస్తారో చూడాలి.