ఆసక్తికర సమాచారం ఒకటి బయటకు వచ్చింది. తెలుగు మీడియాలో ప్రముఖులుగా పిలిచే ఇద్దరు వ్యక్తులు.. మరో రాజకీయ నేత కలిసి కొత్తగా ఒక కంపెనీని రిజిస్టర్ చేయటం వెలుగులోకి వచ్చింది. పోటాపోటీగా నడిచే రెండు ఛానళ్ల ముఖ్యులు కలిసి వేరు కుపంటి పెట్టటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తుంది.
టీవీ ఛానళ్ల పరంగా టీవీ 9.. ఎన్ టీవీలు పోటాపోటీగా ఉంటాయి. ఏ వారానికి ఆ వారం రేటింగ్ లో తమ ప్రత్యర్థుల్ని తలదన్నేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యూహాలు రచిస్తుంటారు. అలాంటి రెండు న్యూస్ ఛానల్స్ కు చెందిన ప్రముఖులు కలిసి ఎలెవన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ గా రిజిష్టర్ చేసినట్లుగా చెబుతున్నారు.
ఈ కంపెనీలో డైరెక్టర్లుగా టీవీ 9 ఛానల్ రవిప్రకాష్.. ఎన్ టీవీ ఛైర్మన్ నరేంద్రనాథ్ చౌదరి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి వెంకటేశ్వరరావు లు ఉన్నారు. ఈ కంపెనీ పెట్టటం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మీడియా వర్గాల సమాచారం ప్రకారం త్వరలో కొత్త తెలుగు ఛానెల్ తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారని.. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. కొత్త మీడియాను తీసుకు వస్తే టైమింగ్ పరంగా తిరుగు ఉండదన్న మాట వినిపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కంపెనీలో తాజాగా ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీ కూడా చేరనున్నట్లు చెబుతున్నారు. వీరంతా కలిసి కొత్త మీడియాను తీసుకొస్తే తెలుగునాట మరో సంచలనంగా మారటం ఖాయమంటున్నారు.