ఇన్నాళ్లూ తెలుగు ప్రపంచానికి నీతులు చెప్పిన మీడియా దిగ్గజం రవిప్రకాష్.. ఇప్పుడు ఫోర్జరీ కేసులో ఇరుక్కుని పరారీలో ఉన్నాడు. ఇప్పటికే రవిప్రకాష్ కు తెలంగాణ పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా ఆర్పీ మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఇంతకూ రవిప్రకాశ్ ఎక్కడున్నాడు అనే దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేకపోయినా.. కొంతమంది చెప్తున్న దాని ప్రకారం రవిప్రకాష్ ముంబైలో ఉన్నాడట. ప్రస్తుతం రిలయన్స్ వారితో సంప్రదింపులు జరుపుతున్నాడని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. రిలయన్స్ గ్రూప్ తెలుగు ఛానెల్స్ కి సీఈఓ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడని వార్తలు వస్తున్నాయి.
టీవీ9తో రవిప్రకాశ్ కు ఏమాత్రం సంబంధం లేదని మొన్నటితోనే తేలిపోయింది. ఇలాంటి టైమ్ లో మళ్లీ ఏదో ఒక ఛానెల్ లో కన్పించి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు రవిప్రకాష్. ఐ న్యూస్ ని టేకోవర్ చేసేందుకు చర్చలు జరిగాయని వార్తలు వచ్చినా… అవేవీ నిజం కాదని ఐ న్యూస్ లో కీలక భాగస్వామి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కురమార్ రెడ్డి సోదరుడే కన్ ఫర్మ్ చేశాడు. దీంతో.. రవిప్రకాశ్ తనకున్న పరిచయాలతో.. ముంబై నుంచి నరుక్కొస్తున్నాడని.. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ చానెల్స్ లో జాయిన్ అయ్యేలా పావులు కదుపుతున్నాడని సమచారం.
రిలయన్స్ కు దేశవ్యాప్తంగా చాలా మీడియా ఛానెల్స్ ఉన్నాయి. న్యూస్ 18, కలర్స్, ఎమ్ టీవీ లాంటి ప్రతిష్టాత్మక చానెల్స్ లో ముకేష్ అంబానీకి పెట్టుబడులున్నాయి. ఇక రిలయన్స్ వారి న్యూస్ 18 తెలుగులో ఆల్ రెడీ వెబ్ సైట్ రన్ చేస్తోంది. త్వరలో పూర్తిస్థాయిలో ఛానెల్ పెట్టే ఉద్దేశాల్లో కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో.. రిలయన్స్ వారితో రవిప్రకాశ్ భేటీ అయినట్లు వార్తలు రావడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఒకవేళ రిలయన్స్ ప్రతినిధులు రవిప్రకాష్ ను చేరదీస్తే ... రవి ప్రకాష్ సుడి తిరిగినట్లే లెక్క. తెలుగులో న్యూస్ చానెల్ తోపాటు ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ని కూడా రవిప్రకాష్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. పైగా రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రులు వాళ్లని కంట్రోల్ చేయలేరు. కాబట్టి రవి ప్రకాష్ సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లు అవుతుంది.