తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. గులాబీ దళపతి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ మద్దతు కోరుతూ అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఏపీలోని కర్నూలు నుంచి అలంపూర్‌కు వచ్చారు. ఇవాళ అలంపూర్ లో సీఎం కేసీఆర్ సభ ఉండటంతో ఆయన మద్దతు కోసం న్యాయవాదులు తరలివచ్చారు. ఈసందర్భంగా మాట్లాడిన న్యాయవాదులు.. ప్రత్యేక తెలంగాణ సాధన ద్వారా సీఎం కేసీఆర్ తమకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు తమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు.
ఈ సందర్భంగా అలంపూర్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. ఆర్డీఎస్ కాలువను నాశనం చేసిన దుర్మార్గులకు బుద్ది చెప్పాలంటే అబ్రహాంను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ``హక్కుల కోసం పోరాడే ఒకే ఒక్క పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ, ఆర్డీఎస్‌ను తీసుకుని లక్షా 20 వేల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత నాది. అలంపూర్ జిల్లా బార్డర్‌లో ఉంది. కర్నూలుకు వెళ్లే అవసరం లేకండా.. గెలిచిన తర్వాత నెల లోపల అలంపూర్‌ను ఆస్పత్రిని 100 పడకలు చేస్తా. డిగ్రీ కాలేజీలు, ఫైర్ స్టేషన్ కావాలన్నరు. మూడు, నాలుగు నెలల్లో ఏర్పాటు చేస్తా. వాల్మీకి సోదరుల సమస్యలు, గిరిజనుల రిజర్వేషన్లు రానున్న రోజుల్లో సాధించుకుంటాం` అని సీఎం స్పష్టం చేశారు.