పార్టీ మార్పు పై తేల్చేసిన రాయపాటి

Update: 2020-01-02 09:25 GMT
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు కు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై మంగళవారం సీబీఐ కేసు నమోదయింది. బ్యాంకుల నుంచి రూ. వందల కోట్ల రుణాల తీసుకొని ఎగవేశారని సీబీఐ అధికారులు 120 బి, రెడ్‌విత్‌ 420, చీటింగ్, 406, 468, 477ఏ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌తోపాటు చైర్మన్‌ గా ఉన్న రాయపాటి సాంబశివరావు, ఇండిపెండెంట్‌ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు చెందిన కొందరు ఉద్యోగుల పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.

అలాగే హైదరాబాద్, గుంటూరు, బెంగుళూరు ప్రాంతాల్లోని రాయపాటి నివాసాలు, ఆఫీసు ల్లో సీబీఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇంటిపై సీబీఐ సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అలాగే మరోవైపు ఆయన టీడీపీని వీడతారని కూడా పుకార్లు రావడం తో తాజాగా ఈ వ్యవహారం పై రాయపాటి క్లారిటీ ఇచ్చారు. సీబీఐ వచ్చినప్పుడు నేను కంపెనీ లో లేను. తనిఖీలు చేసి ఏమీ లేదని సీబీఐ అధికారులు వెళ్లి పోయారు. సీబీఐ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. కంపెనీ వ్యవహారాలన్నీ సీఈవో చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదు.. ఒకవేళ మున్ముందు ఉండొచ్చు అని రాయపాటి తెలిపారు.
Tags:    

Similar News