ప్రియా వారియర్... ఒకే ఒక్కసారి అలా బాయ్ ఫ్రెండ్ వైపు చూస్తూ కన్ను గీటి కుర్రాళ్ల గుండెలను నిజంగానే పించేసిందని చెప్పాలి. అసలు మొన్నటిదాకా ప్రియా వారియర్ ఎవరో కూడా పెద్దగా తెలియదు. మళయాళ సినీ రంగంలోకి ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చిన ప్రియా... తన తాజా చిత్రం *ఒరు ఆదార్ లవ్*లో బాయ్ ఫ్రెండ్‌ను చూస్తూ కన్న గీటడం, బాయ్ ఫ్రెండ్‌కు క్లాసులో కూర్చునే ఫ్లైయింగ్ కిస్సులు ఇవ్వడం, వాటిని తుపాకీతో పేల్చేస్తున్నట్లుగా చాలా హస్కీగా కనిపించి మొత్తానికి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిందనే చెప్పాలి. అప్పటిదాకా ఇంటర్ నెట్ సెర్చ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న సన్నీ లియోన్... ప్రియా దెబ్బకు కిందకు దిగిపోవాల్సి వచ్చింది. ఒక్కసారి కన్ను గీటడంతోనే ప్రియా టాప్ సెలబ్రిటీగా మారిపోయిందని చెప్పక తప్పదు. రాత్రికి రాత్రే వచ్చేసిన స్టార్ డమ్‌తో ప్రియా ఉబ్బితబ్బిబ్బైపోతోంది.
మొత్తం కుర్రకారు ప్రియా ఫొటోలను చూస్తూ మైమరచిపోతుంటే... కొన్ని సంఘాలు మాత్రం ప్రియా కారణంగా తమకు తీవ్ర పరువుకు భంగం కలిగే ప్రమాదం ఉందంటూ ఆందోళనకు దిగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం సంఘాలు ప్రియా తాజా చిత్రంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రియాపై మన హైదరాబాదులోని ఓల్డ్ సిటీలో ఓ పోలీసు కంప్లైంట్ కూడా నమోదైంది. తాజాగా ముంబైకి చెందిన మరో ముస్లిం సంఘం ఇప్పుడు ప్రియాను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగిపోయింది. ఒరు ఆదార్ లవ్ చిత్రంలో ప్రియాపై తీసిన పాట *మాణిక్య మలరాయ పూవీ*ను తొలగించాలని ముంబైకి చెందిన ముస్లిం సంస్థ రజా అకాడెమీ డిమాండ్ చేస్తోంది.
కేవలం డిమాండ్ చేయడంతోనే సరిపెట్టని రజా అకాడెమీ... ఏకంగా ప్రియా, ఒరు ఆదార్ లవ్ చిత్ర యూనిట్‌పై ఏకంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఫిర్యాదు చేసేసింది. ఈ ఫిర్యాదులో రజా అకాడమీ ఆసక్తికర వాదన వినిపించింది. ప్రియా నటించిన పాటలోని భావం ముస్లింల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఈ పాట మహమ్మద్ ప్రవక్త భార్యను తప్పుగా చూపిస్తోందని రజా అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు సయీద్ నూరీ ఆరోపించారు. ఈ కంప్లైంట్ తో ప్రియా పాట ఇబ్బందుల్లో పడిందన్న వాదన వినిపిస్తోంది.