ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. నోట్ల రద్దుతో దేశం పదేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఆర్థికంగా కుదేలయ్యింది. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. పైసా పుట్టక కొత్తగా పరిశ్రమల రాక తగ్గిపోయింది. జనం వద్ద నగదు చెలామణీ పడిపోయింది. ఇలా ఎన్నో కారణాలున్నాయి. నోట్ల రద్దు జరిగి ఇన్ని రోజులవుతున్నా ఇంకా ఏటీఏంలలో డబ్బు ఉండకపోవడం మోడీ ఆర్థిక విధానాలను తెలియజేస్తుంది. అంతేకాదు.. బ్యాంకుల సంస్కరణలంటూ మోడీ చేస్తున్న పనులు వాటిపై నమ్మకాన్ని పోగొడుతున్నాయి. జనాలు ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోకుండా వేరే మార్గాలకు మళ్లిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలు..
అయితే తాగా దేశ ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేసిన సర్వే సంచలనమైంది. వివిధ అంశాలపై ఆర్బీఐ ఎప్పటికప్పుడు కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తుంటుంది. తాజాగా ఈ మేలో దేశంలోని మెట్రో నగరాలైన ముంబై - ఢిల్లీ - చైన్నై - బెంగళూరు - హైదరాబాద్ లల్లో నిర్వహించింది. మోడీ ప్రభుత్వ ప్రభుత్వ హయాంలో ఆర్థికరంగం దివాలా దీసిందని ఏకంగా 48శాతం మంది స్పష్టం చేయడం విశేషం. దేశ ఆర్థిక రంగం దారుణంగా దెబ్బతిందని వ్యాఖ్యానించారు. 31.9 శాతం మంది మాత్రం మెరుగుపడిందని చెప్పారు.
తాజా సర్వేలో అందరూ మోడీ చేసిన నోట్ల రద్దు వల్ల ఆర్థిక రంగంతోపాటు ఉద్యోగ కల్పన అత్యంత దారుణంగా ఉందని.. రాబోయే రోజుల్లో ఇంకా ప్రతికూలంగా ఉండనుందని తెలిపారు. వేతనాల పెరుగుదలపై ఆశలు వదిలేసుకున్నామని సర్వేలో చెప్పారు. వేతనాల పెరుగుదల దారుణంగా ఉందని 23.9 శాతం మంది.. మెరుగుదల కనిపిస్తోందని 27.2శాతం మంది చెప్పారు.
ఇక ద్రవ్యోల్బణం దిగజారిందని 2014లో 1.8శాతం మంది అంటే.. ఈసారి వారి సంఖ్య 7.3శాతానికి పెరిగింది. ధరల పరిస్థితి మెరుగుపడిందని నాలుగేళ్ల కింద 87.1శాతం మంది చెబితే.. తాజా సర్వేలో వారి సంఖ్య 79.2 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇక మోడీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పనలు దారుణంగా ఉందని 44.1శాతం ఉంటే.. మెరుగుపడిందని చెప్పినవాళ్లు 31.5 శాతం మంది ఉన్నారు. ఇలా మోడీ అసంబద్ధ ఆర్థిక విధానాల వల్ల దేశం ఆర్థికంగా తిరోగమించిందని తాజా ఆర్బీఐ సర్వేలో మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.