కేంద్రంపై రిజ‌ర్వ్ బ్యాంక్ యుద్ధం

Update: 2015-11-20 06:47 GMT
దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన కీల‌క సంస్థ‌ల్లో ఒక‌టైన ఆర్బీఐపై కేంద్రం, ప్ర‌త్యేకించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధిప‌త్యంపై గ‌త కొన్నేళ్లుగా ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం న‌డుస్తోంది. గ‌త ఆర్థిక మంత్రి చిదంబ‌రం, అప్ప‌టి ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ల మ‌ధ్య కూడా ప్ర‌చ్ఛ‌న్న యుద్ధాలు జ‌రిగాయి. ఎన్డీయే ప్ర‌భుత్వంలోనూ అది కొనసాగుతున్న‌ట్లుగా ఉంది. స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉన్న వ్య‌వ‌స్థ అయిన ఆర్బీఐ నిర్ణ‌యాలతో కేంద్రానికి కొంత సంబంధం ఉన్నా ఆర్ బీఐ కొన్ని విష‌యాల్లో స్వ‌చ్ఛంగా ముందుకుసాగుతుంది. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి మాత్రం త‌ర‌చూ ఆర్ బీఐపై ఒత్తిళ్లు ఉంటున్నాయ‌న్న‌ట్లుగా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్లు చెప్ప‌క‌నే చెబుతుంటారు. అంతేకాదు, ఆర్బీఐ ఇండిపెండెన్స్ కు కూడా కేంద్రం భంగం క‌లిగిస్తోంద‌నీ గ‌తంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తాజాగానూ కేంద్రం చేప‌డుతున్న కొన్ని సంస్క‌ర‌ణ‌ల‌కు వ్య‌తిరేకంగా ఆర్ బీఐ యుద్ధం మొద‌లుపెట్టింది. గ‌త ఆరేళ్ల‌లో ఎన్న‌డూ లేన‌ట్లుగా ఒకే రోజు ఆర్ బీఐ ఉద్యోగులంతా సెల‌వు పెట్టి కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు.

రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా సిబ్బంది గురువారం ఒక్క రోజు మూకుమ్మడి సెలవులు పెట్టారు. దీంతో కీలకమైన బ్యాంకిం గ్‌ లావాదేవీలు చెక్‌ క్లియరెన్స్‌ - పేమెంట్స్‌ - సెటిల్ మెంట్లు - విదేశీమారకద్ర వ్య లావాదేవీ లపై తీవ్ర ప్రభావం చూపాయి. కేంద్రప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు నిరస నగా...రిటైర్ మెంట్‌ లబ్ధిని మరింత మెరుగుపర్చాలని కోరుతూ ఆర్‌ బీఐకి చెందిన మొత్తం 17వేల మంది సిబ్బంది ఒక రోజు సామూహి కంగా సెలవు పెట్టారు. ఆరు ఏళ్ల తర్వాత ఒకటే సారి దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ సిబ్బంది సామూహిక సెలవులు పెట్టడం ఇదే మొదటిసారి. రిజర్వుబ్యాంకు ఆఫీసర్స్‌ - ఎంప్లాయిస్‌ కు చెందిన యునైటెడ్‌ ఫోరమ్‌ యూనియన్‌ పిలుపుమేరకు సిబ్బంది ఒక రోజు సెలవు పాటించారు. ప్రభుత్వం ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తికి భంగం కలిగిస్తోందని.. ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్‌ బీఐ అధికారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోందని యూనియన్‌ కన్వీనర్‌ సమీర్‌ ఘోష్‌ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రిటైర్‌ కాబోతున్న ఉద్యోగులతో సమానంగా గతంలో రిటైర్ మెంట్‌ అయిన ఉద్యోగులకు లబ్ధి చేకూర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దీంతో స‌మ్మెలు - ఆందోళ‌న‌ల‌కు అంతాగా దిగ‌ని ఆర్ బీఐ కూడా కేంద్రంపై యుద్ధం మొద‌లుపెట్టింద‌ని... ఇది దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాద‌మ‌ని... ప్ర‌పంచ దేశాల నుంచి పెట్టుబ‌డులు కోరుకుంటున్న ద‌శ‌లో దేశంలోని ప్ర‌ముఖ ఆర్థిక సంస్థ కేంద్రంతో త‌ల‌ప‌డుతుండ‌డం ఎంతైనా ఇబ్బందిక‌ర‌మేన‌ని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. కేంద్రం దీన్ని ఎలా ప‌రిష్క‌రిస్తుందో చూడాలి.
Tags:    

Similar News