మోడీ గద్దెనెక్కక ముందు విదేశాల్లోని నల్లడబ్బును అంతా తెచ్చి పేదలకు పంచుతామన్నాడు.. అది తేలేకపోయాడు.. ఓ ఫైన్ మార్నింగ్ దేశంలోని పెద్దనోట్లను రద్దు చేసేశాడు. నల్లడబ్బును వెలికి తీస్తానని శపథం చేశాడు. కానీ అది బెడిసికొట్టింది. అయితే పాత రూ.500 - వెయ్యి నోట్లను రద్దు చేసిన మోడీజీ.. అంతకంటే ఎక్కువైన రూ.2000 నోటును ప్రవేశపెట్టడమే బ్లాక్ మనీ దారులకు వరంగా మారింది..
ఆర్బీఐ నుంచి అలా రూ2000 నోటు రావడం.. ఇలా బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోవడం మొదలైంది. ప్రజలకు రూ.2000 నోటు వచ్చినా చిల్లర సమస్యతో నానా కష్టాలు పడ్డారు. దీంతో మోడీ సర్కారు తెచ్చిన రూ.2000 నోటు ప్రజలకు ఉపయోగపడకపోగా.. నల్లడబ్బు దాచుకునే వారికి వరంగా మారింది.
దీంతో బ్లాక్ మనీనీ అరికట్టడం మాట అటుంచి మోడీ తెచ్చిన రూ.2వేల నోటే బ్లాక్ మనీ గాళ్లకు ఆయాచితవరమైంది. ఇక టెక్నాలజీ విస్తృతంగా వ్యాపించడంతో దేశంలో ఇప్పుడు నకిలీ రూ2వేల నోట్లను పెద్ద ఎత్తున ముద్రించి దేశంలోకి వదిలారని.. ఒరిజినల్ నోటుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో గుర్తించడం కష్టంగా మారిందని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నిగ్గు తేల్చాయి.
ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఈ రెండువేల నోటుపై ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా.. ఆర్బీఐ సంచలన జవాబు ఇచ్చింది. రూ.2వేల నోటును ఏడాది కాలంగా ముద్రించడం ఆపేసినట్టుగా ఆర్బీఐ తెలిపింది. అంతేకాదు.. పార్లమెంట్ లో ఎంపీల ప్రశ్నలకు కూడా కేంద్రం జవాబిచ్చింది. ఇప్పటివరకు చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లు చెల్లుతాయని.. కొత్తగా ఉత్పత్తి మాత్రం చేయమని స్పష్టం చేసింది. దీన్ని బట్టి రూ.2వేల నోటు అంతర్థానమైనట్టే లెక్క. ఇక మనకు రూ.500 - రూ.200 - రూ.100 నోట్లే గతి అన్నట్టు. డబ్రులు డ్రా చేసినా ఇక అవే వస్తాయన్న మాట..మోడీ ప్రవేశపెట్టిన రూ.2వేల నోటు అట్టర్ ఫ్లాప్ అయినట్టే..