డీమానిటైజేషన్ వల్ల కలిగిన ప్రయోజనం ఎంత? అని ప్రశ్నించుకుంటే కేంద్ర ప్రభుత్వం వద్ద సమాధానమే లేదట. అందుకే మొన్న డిసెంబరు 30తో పాత నోట్ల డిపాజిట్ల గడువు ముగిసిన తరువాత ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించినా అందులో ఎక్కడా దీనివల్ల కలిగిన ప్రయోజనాల గురించి లెక్కలేవీ చెప్పలేదు. అంతేకాదు.. ఈ గడువు ముగిసేనాటికి బ్యాంకుల్లోకి తిరిగి రాకుండా ఉండిపోయిన మొత్తమెంతో రిజర్వు బ్యాంకు వెల్లడించలేదు.
రద్దు చేసిన 15.44 లక్షల కోట్ల పాత పెద్ద నోట్లలో బ్యాంకుల్లోకి తిరిగి వచ్చిందెంత? రాకుండా ఉండిపోయిన నల్లధనమెంత? అన్నది ఇప్పటికీ సరైన లెక్కలు ఇవ్వడం లేదు. కానీ.. గడువుకు ముందు వివిధ సందర్భాల్లో ఆర్ బీఐ - ఆర్థికశాఖ అధికారులు చెప్పిన లెక్కలు - ఆర్థిక రంగ నిపుణులు - వార్తా సంస్థల అంచనాల ప్రకారం చూస్తే 99 శాతం డబ్బు మళ్లీ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. బ్యాంకుల్లోకి రాకుండా ఉండిపోయిన మొత్తం చాలా తక్కువగా ఉండడం వల్ల అది చెప్పుకుంటే పరువు పోతుందన్న ఉద్దేశంతోనే లెక్కలు రిలీజ్ చేయనట్లు తెలుస్తోంది.
- నవంబరు 8న పెద్ద నోట్లు రద్దు చేసిన నాటికి రూ.500 - రూ.వెయ్యి నోట్లు 15.44 లక్షల కోట్ల విలువైనవి చలామణీలో ఉన్నాయి.
- పాతనోట్లను డిపాజిట్ చేసే గడువు డిసెంబరు 30నే ముగిసింది.
- డిసెంబరు 10న ఇచ్చిన అధికారిక సమాచారం మేరకు ఇంకా 20 రోజులు గడువు ఉండగానే 12.44 లక్షల కోట్లు తిరిగి వచ్చేసింది.
- నిజానికి బ్యాంకు లావాదేవీలు - చెల్లింపులకు - కార్డుల ద్వారా కొనుగోళ్లు... తదితర డాటా ఆర్ బీఐకి ఎప్పటికప్పుడు చేరుతుంది. బ్యాంకులు ఏ రోజుకారోజు ఈ సమాచారాన్ని ఆర్‌బీఐకి చేరవేస్తాయి. మరి ఆర్ బీఐ డిసెంబరు 30 తరువాత డాటాను ఎందుకు వెల్లడించడం లేదన్నది తాజా ప్రశ్న
.
- దేశంలో రూ.100 అంతకంటే చిన్న మొత్తాల నోట్ల విలువ 2.53 లక్షల కోట్లు
- సుప్రీం కోర్టు ప్రశ్నించినప్పుడు కేంద్రం రూ.5.3 లక్షల మేరకు కరెన్సీ మళ్లీ సిస్టమ్ లోకి రాకపోవచ్చని చెప్పింది. కానీ... దాదాపుగా మొత్తం వచ్చేసింది.
- మరోవైపు ఆర్ బీఐ ఇచ్చిన సీఐసీ గణాంకాల ప్రకారం డిసెంబరు 23 నాటికి చలామణిలో ఉన్న నగదు 9.42 లక్షల కోట్లు. ఇందులోంచి చిన్ననోట్ల రూపంలో ఉన్న 2.53 లక్షల కోట్లను తీసివేస్తే... కొత్తనోట్ల రూపంలో ఆర్‌బీఐ జారీచేసిన మొత్తం 6.89 కోట్లు. అంటే ఉపసంహరించిన నోట్ల స్థానంలో ఆర్ బీఐ 45 శాతానికంటే తక్కువ నోట్లను తిరిగి జనానికి అందుబాటులోకి తెచ్చింది.
- డిసెంబరు 30వ తేదీ ముగిసేనాటికి 14.9 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోని తిరిగి వచ్చిందని అంచనా. దీని ప్రకారం తిరిగిరాని మొత్తం 54 వేల కోట్ల రూపాయలుగా తేలుతుంది.
- మరోవైపు పాత పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం ఆర్థిక కార్యకలాపాలు మందగించడం... అసంఘటిత రంగంలో ఉద్యోగాలు పోవడం తదితర పరిణామాల మూలంగా... భారత స్థూల దేశీయోత్పత్తిపై లక్షన్నర కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా. దీనికి కొత్తనోట్ల ముద్రణ - రవాణా - పంపిణీ ఖర్చులు అదనం.
ఇలా మొత్తానికి డీమానిటైజేషన్ పెద్ద ప్రహసనంగా మిగిలిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/