నిజం: ఆర్ బీఐ న‌కిలీ నోట్లు

Update: 2016-01-21 07:53 GMT
న‌కిలీ నోట్లంటే ప్రైవేటు వ్య‌క్తులు త‌యారు చేసిన‌వి అయి ఉంటాయి లేదా విదేశాలనుంచి దిగుమతి అయిన కేటగిరీకి చెందిన‌వి ఉంటాయి. వీటిని అరిక‌ట్టేందుకు, అవ‌గాహ‌న క‌లిగించేందుకు భారతీయ‌ రిజర్వ్‌ బ్యాంక్ త‌న ప‌రిధిలోకి వచ్చే బ్యాంకుల ద్వారా కృషిచేస్తుంటుంది. కానీ అదే ఆర్ బీఐ ద్వారానే న‌కిలీ నోట్లు మ‌న జేబుల్లోకి చేరుతున్నాయంటే న‌మ్మ‌గ‌ల‌రా?  అది కూడా వందో వెయ్యో కాదు కోట్ల రూపాయ‌ల్లో. స‌రిగ్గా చెప్పాలంటే రూ.30,000 కోట్ల రూపాయ‌ల న‌కిలీ క‌రెన్సీ ఆర్ బీఐ వ‌ల్ల‌, ఆర్బీఐ ద్వారా మ‌న చుట్టూ మార్కెట్‌ లో పోగుప‌డిపోయింది మ‌రి.

రూ. 30 కోట్లు విలువ చేసే వెయ్యి రూపాయల నోట్ల ముద్రణలో తప్పులు దొర్లాయి. అయితే తప్పిదాన్ని గ్రహించడంతో వీటిలో రూ. 20 కోట్ల నోట్లు రిజర్వ్‌ బ్యాంకు వద్దనే ఆపేశారు. కానీ రూ. 10 కోట్ల నోట్లు జనం జేబుల్లోకి చేరిపోయాయి. ఈ నకిలీ నోట్లను గుర్తించడం కూడా చాలా కష్టం ఏయే సీరిస్‌ నోట్లలో తప్పులు దొర్లాయి? ఎన్ని నోట్లు బ్యాంకులో తిరిగి జమ అయ్యాయి? అనేది ఇపుడు త‌ల‌నొప్పిగా మారిపోయింది.

ఆర్‌ బీఐ ఇచ్చిన వివరాల ప్రకారం 5AG, 3AP సీరిస్‌ వెయ్యి రూపాయల నోట్లు సిల్వర్‌ సెక్యూరిటీ దారం లేకుండానే ముద్రించారు. ఈ నోట్ల తయారీకి వినియోగించిన కాగితం ఔరంగాబాద్‌ లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌, మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి వచ్చింది. అక్కడ నుంచి నాసిక్‌ లోని ఆర్‌ బీఐ ప్రెస్‌ కు చేరింది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడే తప్పిదం చోటు చేసుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అధికారులు ఆలస్యంగా మేల్కొని నకిలీ నోట్లను తిరిగి జమ చేయటం మొదలుపెట్టారు. ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంకు వద్ద రూ. 6 కోట్ల విలువైన నోట్లు మాత్రమే జమ అయ్యాయి. అలా సేకరించిన నోట్లను తగలబెట్టెందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి కోరాలని బ్యాంకు నిర్ణయించింది.

మ‌న‌మేం చేయాలి?

మీ దగ్గర వెయ్యి రూపాయల నోట్లు ఉంటే, వాటిపై 5A+ - 3AP సిరీస్‌ ఉందేమో చూసుకోండి. నోటును లైట్‌ కింద పెట్టి పరిశీలించండి. దానిపై మొదటి డిజిట్‌ కింద 'ఎల్‌' అక్షరం కనిపిస్తుంది. ఆ నోటు ముందు భాగాన్ని చూడాలి. అందులో సిల్వర్‌ సెక్యూరిటీ దారం ఉంటుంది.

ఒకవేళ ఆ మూడు అంశాల్లోనూ భిన్నంగా ఉన్న నోట్లు మీ దగ్గరుంటే, అవి 'నకిలీ' నోట్లే. అలాంటి నోట్లను జారీ చేయవద్దని బ్యాంకులకు ఆదేశిస్తూ 2015 డిసెంబర్‌ 14 న ఆర్‌బీఐ ఒక లేఖ రాసింది. ఖాతాదారులు అలాంటి నోట్లను తీసుకుని బ్యాంకులకు వచ్చినా పూర్తి మార్పిడి విలువను ఇవ్వాలని ఆర్‌బీఐ సూచించింది.
Tags:    

Similar News