అఫిషియ‌ల్ః నోట్ల ర‌ద్దు మోడీ ఘ‌న‌త కాదు

Update: 2016-12-25 10:06 GMT

ఇన్నాళ్లు భావించిన‌ట్లు పెద్ద నోట్లు ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న‌ది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కాద‌ట‌. పెద్దనోట్ల రద్దు ప్రతిపాదన తమదేనని భారత రిజర్వు బ్యాంకు తెలిపింది. అది కూడా అధికారికంగా వివ‌ర‌ణ ఇచ్చింది. నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి ఎనిమిది గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించడానికి కొన్నిగంటల ముందే.. 500 - 1000 నోట్లను రద్దుచేయాలని సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ డైరెక్టర్లు ప్రాతిపాదించినట్టు హిందూస్థాన్ టైమ్స్ అడిగిన‌ సమాచార హక్కు చట్టం అర్జీలో ఆర్బీఐ తెలిపింది.

దేశంలో పెద్దనోట్ల రద్దు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం - ఆర్బీఐ ఉమ్మడిగా రహస్యంగా చేపట్టినట్టు ఈ ఆర్టీఐ స‌మాధానంలో రిజ‌ర్వ్ బ్యాంక్ వెల్లడించింది. సుదీర్ఘకాలంగా చేపట్టిన చర్చలు, అనేక సమాలోచనల అనంతరం రద్దు వ్యవహారాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్టు స్పష్టంచేసింది. ఈ నిర్ణ‌యంతో ఇన్నాళ్లు నోట్ల ర‌ద్దు ప్ర‌ధాన‌మంత్రి సొంతంగా తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని తేలిపోయింది ఆర్బీఐ 1934 చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఏ సిరీస్ బ్యాంకు నోట్లు అయినా రద్దు చేసే అధికారం ఉంటుంది. అయితే, సొంతంగా ఏ ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు ప్రతిపాదనల మేరకే నిర్ణయం తీసుకుంటుంది అని పేర్కొంది.

ఇదిలాఉండ‌గా...  పెద్ద నోట్ల రద్దు ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమంటూ డిసెంబర్ 30 తర్వాత అవినీతిపరులు తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నోట్ల ర‌ద్దు ప‌రిణామంపై ఆయ‌న స్పందిస్తూ...దేశంలో ప్రధాన సమస్యలను కేవలం అభివృద్ధి మాత్రమే పరిష్కరిస్తుందని, అందుకే తమ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.  దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా కష్టమైన నిర్ణయాలకు వెనుకాడబోమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. తమ ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరిస్తున్నదని, స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలను పట్టించుకోదని అన్నారు. క్యాపిటల్ మార్కెట్లపై అధిక పన్నులు వేయాల్సిన అవసరముందని మోడీ నొక్కిచెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News