ఆర్బీఐ సంచలనం: పెరగనున్న లోన్ వడ్డీ రేట్లు

Update: 2022-05-04 09:31 GMT
ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపోరేటు 4.40 శాతానికి చేరింది. బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు భారీగా పెరుగనున్నాయి. ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా తగ్గింది. నిఫ్టీ 280 పాయింట్లకు పైగా తగ్గింది. 2022 తర్వాత తొలిసారి రెపో రేటు పెరిగింది. ఫెడ్ నిర్ణయానికి ముందే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచింది.

ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరుగనున్నాయి. అలాగే గృహ రుణాల ఈఎంఐలు పెరుగనున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడంతో వడ్డీ పెంచక తప్పలేదని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.

ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 2.37 గంటల సమయంలో సెన్సెక్స్ 1120 పాయింట్లు పడిపోయి 55879 వద్దకు చేరింది. నిఫ్టీ 345 పాయింట్లు దిగజారి 16721 వద్ద ట్రేడ్ అవుతోంది.

గతంలో కరోనా నేపథ్యంలో రుణగ్రహీతలకు ఆర్‌‌బీఐ ఎంతో వెసులుబాటు కల్పించింది. లోన్లపై ఆరు నెలల పాటు మారటోరియం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రుణగ్రహీతలు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ.. ఆ మారటోరియం విషయంలో వడ్డీల మీద చక్రవడ్డీలు వేయడంతో పలువురు రుణగ్రహీతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇంకా ఏమైనా వెసులుబాటు ఇచ్చేందుకు ప్రయత్నించాలంటూ సుప్రీం కోర్టు ఆర్‌‌బీఐకి సూచించింది.

కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వ్యాపారుల బిజినెస్‌లు మూతపడ్డాయి. ఎవరికీ ఎలాంటి ఆదాయమూ లేకుండా పోయింది. దీంతో మార్చి 1 - మే 31 మధ్య కాలానికి రుణాలు, వడ్డీ, కిస్తీల చెల్లింపుల విషయంలో మారటోరియం ప్రకటిస్తూ ఆర్‌బీఐ మార్చి 27న సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపు కారణంగా మారటోరియం గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల భారమేమి తగ్గదని, ఆ తర్వాతైనా చక్ర వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని విచారిస్తున్న సుప్రీంకోర్టుకు   కేంద్రం ఓ అఫిడవిట్‌ సమర్పించింది. రూ.2 కోట్లలోపు రుణాల విషయంలో చక్ర వడ్డీని మాఫీ చేస్తున్నట్లు అందులో పేర్కొంది.

ఇక కరోనా నేపథ్యంలోనే గృహ, పర్సనల్ లోన్లను భారీగా తగ్గించింది ఆర్బీఐ. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా ఇలానే వడ్డీరేట్లు తగ్గించి వినియోగదారులను ఆకర్షించాయి. ఇప్పుడు పరిస్థితులు కుదట పడడంతో వడ్డీ రేట్లు పెంచుతూ వినియోగదారులకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది.
Tags:    

Similar News