ఐపీఎల్ ప్రతి సీజన్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక మోస్తరు ప్రతిభ అయినా కనబర్చేవారు. కాని ఈ సీజన్ లో వరుసగా ఆరు మ్యాచ్ లు ఓడిపోవడంతో అంతా కూడా షాక్ అయ్యారు. టీం ఇండియా కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ సారధ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు మరీ ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొవడం ఏంటని అంతా కూడా విమర్శలు వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో తన జట్టుకు విజయాలను అందించలేక పోతున్న కోహ్లీ త్వరలో జరుగబోతున్న ఐసీసీ మెగా టోర్నీ అయిన ప్రపంచ కప్ ను ఎలా సాధిస్తాడు అంటూ ప్రశ్నించారు. కోహ్లీకి కెప్టెన్ గా కొనసాగే అర్హత లేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలో వరుసగా ఆరు ఫ్లాప్ ల తర్వాత ఏడవ మ్యాచ్ లో విజయాన్ని దక్కించుకున్నారు.
ఈ సీజన్ లో మొదటి విజయాన్ని దక్కించుకోవడంతో కోహ్లీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఎట్టకేలకు విజయం దక్కిన నేపథ్యంలో కోహ్లీ స్పందిస్తూ తాను వరుసగా ఓటముల్లో ఉన్న సమయంలో అనుష్క చాలా మద్దతుగా నిలిచింది. నాకు ఆమె ఇచ్చిన స్ఫూర్తిని మరువలేను. ఇంతకు ముందు నేను కష్టకాలంలో ఉన్న సమయంలో అమ్మ నాకు మద్దతుగా నిలిచేది. ఇప్పుడు ఆ స్థానంను అనుష్క భర్తీ చేసింది. నా వెంట ఒక దృడమైన వ్యక్తి ఉన్నందున నేను ఎలాంటి ఫలితాలను అయినా ఎదుర్కోగలుగుతున్నాను, వాటి నుండి బయట పడుతున్నాను అంటూ కోహ్లీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఎట్టకేలకు ఆర్ సీ బీ విజయం సాధించడంలో అనుష్క కీలక పాత్ర పోషించిందంటూ కోహ్లీ చెప్పకనే చెప్పాడు. బెంగళూరు ఇకపై అయినా సక్సెస్ లను కొనసాగిస్తారా లేదంటే మళ్లీ ఓటముల దారిలో నడుస్తారో చూడాలి.