మనలో చాలామంది రైలు ప్రయాణం చేసి ఉండే ఉంటారు. రైల్వే టికెట్ తీసుకుని ప్రయాణికులు రైలు ఎప్పుడు వస్తుందా? అని అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మనోడేమో రైలు గంటకు వస్తుంది? అర్ధ గంటకు వస్తుందంటూ అనౌన్స్మెంట్ ఇస్తూ పోతుంటాడు. మనం ఎక్కే రైలు జీవిత కాలం లేటు అన్నట్లుగా రైళ్లు ఎప్పుడు సమయానికి వచ్చిన దాఖలు మాత్రం కన్పించవు.
రైల్వే శాఖ నోటీసు బోర్డులో పేర్కొన్న టైం టేబుల్ ప్రకారంగా రైళ్లు నడిచిన దాఖలు చాలా అరుదనే చెప్పవచ్చు. ఇలాంటి అనుభవాలు రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యే ఉంటుంది. దీంతో ప్రయాణికులు సైతం రైళ్ల టైమింగ్ అటు ఇటుగా వాళ్ల ప్రయాణాన్ని ముందుస్తుగా ప్లాన్ చేసుకోవడం కామన్ గా మారిపోయింది.
ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. నటుడు సోనూసూద్ గతంలో ఎప్పుడో చేసిన వీడియో రైళ్ల నడిపినట్లు నింపాదిగా స్పందించింది. గత ఏడాది డిసెంబర్ 13న సోనూసుద్ రైల్వే ప్రయాణం చేస్తూ ఫుట్ బోర్డుపై నిలబడి ఓ వీడియోను చేశాడు. ఆ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేయగా నెటిజన్లు మాత్రం ఆయనకు షాకిచ్చారు.
అందరికీ ఆదర్శంగా ఉండే మీరు ఫుట్ బోర్డుపై ప్రమాదకర రీతిలో నిలబడి వీడియో తీయడం మంచిది కాదని సూచించారు. మిమ్మల్ని చూసి మీ అభిమానులు ఇలా చేసే అవకాశం ఉంటుందని.. భవిష్యత్తులో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ట్వీట్ చేయండి అంటూ విమర్శించారు. దీనిపై అప్పట్లోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
ఈ వీడియోపై నార్త్ రైల్వేశాఖ జనవరి 4న స్పందించి. సోనూసూద్ ను ట్యాగ్ చేస్తూ.. దేశంలోని.. ప్రపంచంలోని లక్షలాది మందికి మీరు రోల్ మోడల్ అని పేర్కొంది. అలాంటి మీరు ఇలా రైల్వే ఫుట్ బోర్డుపై ప్రమాదకర రీతిలో ప్రయాణం చేయడం అభిమానులకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని.. దయచేసి ఇలాంటివి చేయకండి అంటూ పేర్కొంది. ప్రశాంతమైన.. సురక్షితమైన ప్రయాణాన్ని రైల్వేలో ఎంజాయ్ చేయండి అంటూ రైల్వే శాఖ ట్వీట్ చేసింది.
అయితే గత ఏడాది డిసెంబర్ 13న సోనూసూద్ వీడియో పోస్టు చేయగా రైల్వే శాఖ నింపాదిగా స్పందించడంతో నెటిజన్లు ఆ రేంజులో సైటర్లు పేలుస్తున్నారు. సోనూసూద్ వీడియోపై ఇంత త్వరగానే స్పందించేది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో మీరు నడిపే రైళ్లు ఆలస్యంగా వచ్చినట్లే.. మీ ట్వీట్లు కూడా లేటే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

प्रिय, @SonuSood
— Northern Railway (@RailwayNorthern) January 4, 2023
देश और दुनिया के लाखों लोगों के लिए आप एक आदर्श हैं। ट्रेन के पायदान पर बैठकर यात्रा करना खतरनाक है, इस प्रकार की वीडियो से आपके प्रशंसकों को गलत संदेश जा सकता है।
कृपया ऐसा न करें! सुगम एवं सुरक्षित यात्रा का आनंद उठाएं। https://t.co/lSMGdyJcMO