మండపంలో వరుడికి రీడింగ్ టెస్ట్ .... పెళ్లి వద్దన్న వధువు, అసలేంజరిగిందంటే ?

Update: 2021-06-23 11:30 GMT
పెళ్లి ... ఓ జీవితం. నూరేళ్ల జీవితానికి ఓ నాంది. కానీ, చాలావరకు పెళ్లిళ్లు ఈ మధ్య అబద్దాలతోనే జరుగుతున్నాయి. అలాగే మరికొన్ని పెళ్లి ఇంట్లో వారికి ఇష్టం అనో , డబ్బు ఎక్కువగా ఉందనో జరుగుతున్నాయి. కానీ, ఇదే తరుణంలో కొందరు అమ్మాయిలు తమ పెళ్లిళ్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంటూ , మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నారు అని తెలియగానే పెళ్లి పీటలపైనే పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. వరుడు పెళ్లి లో నల్ల కళ్లద్దాలు పెట్టుకోవడంతో అనుమానం వచ్చిన వధువు , ఓ దినపత్రికని ఇచ్చి చదవమని చెప్పడంతో అడ్డంగా బుక్కైయ్యాడు. ఇంకేముందు అందరిని ముందు ఏ మాత్రం భయం , బెరుకు లేకుండా ఆ యువతి నాకు ఇలాంటి వాడు వద్దు , నేను ఈ పెళ్లి చేసుకొని అని తెగేసి చెప్పేసింది.

వివరాల్లోకి వెళ్తే .. ఈ ఘటన యూపీలోని ఔరయ పరిధిలో చోటు చేసుకుంది. అచల్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్ పూర్ గ్రామానికి చెందిన వినోద్ కుమార్ తో తన కూతురు  వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని కార్యక్రమాలని సిద్ధం చేసుకున్నారు. చివరికి ఆ పెళ్లిరోజు కూడా వచ్చేసింది. ఎంతో ఘనంగా పెళ్లి పనులు ప్రారంభించారు. ఇక పెళ్లి వేదికపై కూడా వరుడు నల్ల కళ్లద్దాలు పెట్టుకోవడంతో అతనిపై అనుమానం మొదలైంది. దీనితో వెంటనే వారు వరుని తరుపువారిని ప్రశ్నించారు. వరుడి తరపు బంధువులు కరెక్ట్ గా సమాధానం చెప్పకపోవడంతో, నేరుగా వరునికి  ఓ దినపత్రిక ఇచ్చి చదవాలని చెప్పారు. దీనితో  అతను చదవలేకపోయాడు.  ఇదే విషయంపై ఇరువర్గాల మధ్య పంచాయితీ జరిగింది. దీంతో వధువు తనకు ఈ పెళ్లి వద్దని వధువు తెగేసి చెప్పింది. అంతేకాకుండా  వరుడి కుటుంబ సభ్యులపై, వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Tags:    

Similar News