అసెంబ్లీలో మరో రచ్చకు రెడీ

Update: 2022-09-20 06:48 GMT
అసెంబ్లీలో ఇపుడు జరుగుతున్న గొడవలు సరిపోవన్నట్లుగా కొత్తగా మరో అంశం తోడైంది. చంద్రబాబు నాయుడు హయాంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసి కొందరి మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేశారని, అలాగే ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేశారనే ఆరోపణలను నిర్ధారిస్తు ఒక కమిటి తన మధ్యంతర నివేదికను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు అందించింది. ఆ నివేదికను బహుశా స్పీకర్ సభలో ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటినుండి చంద్రబాబు తమ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నట్లు ఆరోపిస్తోంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అప్పట్లో పదే పదే ఆరోపణలు చేయటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు.

అయితే ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు పౌరుల వ్యక్తిగత డేటా చోరీ అంశాలపై విచారణకు అసెంబ్లీ సభ్యులతో సభా కమిటిని నియమించారు.

ఆ కమిటి తన మధ్యంతర నివేదికను ఇపుడు స్పీకర్ కు అందించింది. అందులో చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసి కొంతమంది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు మధ్యంతర నివేదికలో స్పష్టం చేసింది. అలాగే వ్యక్తుల వ్యక్తిగత డేటాను కూడా చోరీ చేశారని నిర్ధారించింది. ఈ రెండు కూడా చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరిగిందని నివేదికలో సభ్యులు చెప్పారు.

కమిటీ ఇచ్చిన నివేదికపై  స్పీకర్ చర్చకు అనుమతిస్తే సభలో రచ్చరచ్చ అవ్వటం ఖాయం. ఎందుకంటే నివేదిక కాపీలను సభ్యులందరికీ అందిస్తారు. అప్పుడు ఈ నివేదికను టీడీపీ ఎలాగూ అంగీకరించదు. ఇదే సమయంలో వైసీపీ చర్చకోసం పట్టుబడుతుంది.

దాని ఫలితంగా సభలో గొడవలవటం ఖాయం. మరి పెగాసస్, డేటా చౌర్యంపై చర్చ జరుగుతుందా ? లేదా అన్నది ఆసక్తిగా మారింది.  పదే పదే గొడవలు చేస్తున్నారని టీడీపీ సభ్యులను సభనుండి బయటకు పంపేసి చర్చను కంటిన్యు చేసే అవకాశాలే ఎక్కువుగా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News