వివాదాస్పద వ్యాఖ్యల్ని ఏమాత్రం మొహమాటం లేకుండా చేసే ముఖ్యమైన వారిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ ఒకరు ఉంటారు. తన దృష్టిని ఆకర్షించిన అంశాలపై ముందువెనుకా ఆలోచించకుండా ఆయన నోటి నుంచి వ్యాఖ్యలు వస్తాయన్న విమర్శ ఉంది. సుప్రీం మాజీ న్యాయమూర్తులన్న హోదా ఉన్న వారు ఆచితూచి మాట్లాడటం.. పరిమిత వేదికల్లో మాత్రమే హాజరయ్యే లాంటివి కనిపిస్తాయి. కానీ.. కట్జూ అందుకు మినహాయింపుగా చెప్పాలి. ఏ ఇష్యూ అయినా సోషల్ మీడియాలో తన వాదనను పోస్ట్ చేసేస్తుంటారు. తాజాగా కేరళలోని కదిలే రైలులో అత్యాచారానికి..ఆపై హత్యకు గురైన బాధితురాలి గురించి వ్యాఖ్యలు చేయటంతోపాటు.. ఇంత దారుణానికి పాల్పడిన వ్యక్తికి జైలుశిక్షను పరిమితం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బాహాటంగా విమర్శించటమే కాదు.. తీర్పు ఏమాత్రం బాగోలేదని తేల్చి చెప్పారు.
ఇలా తనకు అనిపించింది అనిపించినట్లుగా చెప్పే కట్జూ ఆ మధ్యన గోవధ.. గొడ్డు మాంసాలకు సంబంధించిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ జస్టిస్ కట్జూ మీద ఒక పిటిషన్.. అలహాబాద్ కోర్టులో దాఖలైంది. దీనిపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కట్జూకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. తనను కోర్టుకు రావాలన్న మాటపై కట్జూ తనదైన శైలిలో స్పందించారు. తనను అనుమతిస్తే.. సుప్రీంకోర్టు ఎదుట హాజరై.. తన వాదనలు వినిపించటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆయన.. తాను సుప్రీంకోర్టులో అడుగుపెట్టకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (7) నిషేదిస్తుందని.. అయితే.. తనకు తన వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తే.. తాను సుప్రీంకోర్టుకు వచ్చి తన వాదనలు వినిపిస్తానని ఆయన చెబుతన్నారు.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తి ఎవరైనా.. భారతదేశంలోని ఏ కోర్టులోనూ.. ఏ అధికారి ఎదుట వాదన వినిపించదారన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (7)లో స్పష్టం చేశారని.. ఈ ఆర్టికల్ వర్తించదని తనకు ఆదేశాలు జారీ చేస్తే.. తాను కోర్టుకు వచ్చి తన వాదనల్ని సంతోషంగా వినిపిస్తానని చెప్పిన కట్జూ మాటకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/