దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రెడీ: మోడీ

Update: 2021-01-04 11:10 GMT
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం భారత్ లో త్వరలో ప్రారంభం కానుందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు.జాతీయ తూనికలు, కొలతల శాఖ సమావేశంలో ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ కరోనా వ్యాక్సిన్ తయారీకి కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. ‘మేడిన్ ఇండియా’ కోవిడ్ టీకాలను తీసుకురావడంలో భారత శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారని తెలిపారు. రెండు స్వదేశీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందని కొనియాడారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్ లో త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ సందర్భంగా మేకిన్ ఇండియాను దేశం అవలంభిస్తోందని.. మనం తయారు చేసే ఉత్పత్తులకు పరిమాణం ఎంత ముఖ్యమో.. నాణ్యత కూడా అంతే ముఖ్యమన్నారు.నాణ్యత, విశ్వసనీయత గల ఉత్పత్తులను తీసుకొస్తూ మన బ్రాండ్ ఇండియాను మరింత బలోపేతం చేయాలన్నారు.

మేకిన్ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రపంచంలోనే సృజనాత్మక ర్యాంకింగ్స్ లో భారత్ టాప్ 50లో నిలిచిందని.. పరిశ్రమ, సంస్థల మధ్య సహకారం మరింత బలోపేతమవుతోందని చెప్పారు.




Tags:    

Similar News