అమరావతి శంకుస్థాపన నిర్ణయంతో విజయవాడ ప్రాంతంలోని రియల్టర్ల జోరు సాగుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం ఒకవైపు చంద్రబాబు వేగంగా ముందుకు సాగుతుండగా, ఆయన కన్నా వేగంగా రియల్టర్లు ముందుకు దూసుకు వెళుతున్నారు. ఏడాది క్రితం వరకు హైదరాబాద్ నగరంలోనూ, హైదరాబాద్ చుట్టుపక్కల బిజినెస్ చేసిన సీమాంధ్ర రియల్టర్ వ్యాపారులు ఇప్పుడు అమరావతి చుట్టూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 500 పైగా లేఅవుట్లకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎపిసిఆర్ డిఎ) అనుమతి ఇచ్చింది. అనధికారిక అంచనాప్రకారం దాదాపు 10 వేల కోట్ల నుండి 20 వేల కోట్ల రూపాయల వ్యాపారానికి తెర లేస్తోంది.
అమరావతి సమీపంలోని మంగళగిరి - తాడికొండ - అమరావతి సబ్-రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ ను ఈ ఏడాది ప్రారంభంలో కొంత కాలం పాటు నిలుపుదల చేసిన ప్రభుత్వం ఇటీవలే ఈ రిజిస్ట్రేషన్ల నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రభుత్వంపై రియల్టర్లు తీవ్రమైన వత్తిడి తీసుకురావడంతో నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. రాజధాని ఎంపిక కాకముందే అనేక మంది విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి పట్టణాల చుట్టుపక్కల భూములను భారీ ఎత్తున కొనుగోలు చేసి లేఅవుట్లను రూపొందించారు. వీటికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎపి సిఆర్ డిఎ) అనుమతి ఇచ్చింది. అలా అనుమతి లభించిన వాటిలో వల్లూరుపాలెం-విజయవాడ మధ్యలోని కంకిపాడు వద్ద కోస్టల్ సిటీ వెంచర్‌ను శ్రీ ఆదిత్య అనే సంస్థ ప్రారంభించింది. ఇదే సంస్థ అమరావతి సమీపంలోని చింతలపాడు వద్ద గ్రీన్ ఐలాండ్ పేరుతో లేఅవుట్లను, హనుమాన్ జంక్షన్ (గన్నవరం సమీపంలోని ప్రాంతం) వద్ద క్యాపిటల్ జంక్షన్ పేరుతో గృహసముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. అలాగే ప్రతిపాదిత రాజధాని దగ్గర్లోనే మరో సంస్థ అమరావతి స్మార్ట్ సిటీ పేరుతో మరో వెంచర్ ను చేపట్టింది. మంగళగిరి-విజయవాడ హైవేలో ఎస్‌పి టౌన్ షిప్ అమరావతి గ్రీన్ సిటీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీని చేపట్టింది.
ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కావాలనుకుంటే గజం ఆరు వేల రూపాయల నుండి 15 వేల రూపాయల వరకు ధర నిర్ణయించారు. ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు 25 లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు రియల్టర్లు రేట్లను ఫిక్స్ చేశారు. ఇంటిస్థల వైశాల్యం, బిల్టప్ ఏరియాను అనుసరించి ఈ రేట్లు ఉంటున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ ను, మేథాటవర్స్‌ను కొత్త రాజధాని ప్రాంతాన్ని రియల్టర్లు తమ వ్యాపారానికి ప్రచారాలుగా ఉపయోగించుకుంటున్నారు. రాజధాని అమరావతి నుండి 50 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం రియల్ బూమ్ నడుస్తోంది.