జగన్ పై నమ్మకం..అమరావతిలో రియల్ ఊపు!

Update: 2019-05-12 14:30 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత గత ఐదేళ్లలో ప్రతిపక్ష నేతగా చేసింది ఏమిటి? అంటే.. తన  మీద ప్రజల్లో విశ్వాసం కలిగించడం. తన మాట తీరుతో, తన పోరాట పటిమతో - తన సహనంతో - తన ఓపికతో జగన్ ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించారు. జగన్ మోహన్ రెడ్డి అంటే నిర్వచనమే మారిపోయింది గత ఐదేళ్లలో.

సుదీర్ఘమైన పాదయాత్రతో జగన్ ప్రజల మధ్యనే నిలిచారు. అలా వారిలో విశ్వాసాన్ని కలిగించారు. తనంటే ఏమిటో వారికి స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు. పాదయాత్రతో సామాన్య జనానికి చేరువ కావడమే కాదు.. ఇంకా అనేక కార్యక్రమాలను చేపట్టి సమాజంలోని వివిధ వర్గాలకు సన్నిహితుడు అయ్యాడు.

ప్రత్యేకహోదా పై సదస్సులు - ప్రత్యేకహోదా పై జగన్ మాట్లాడిన మాటలు.. ఇవన్నీ కూడా ఆయనను యువతరానికి చేరువ చేశాయి. అసెంబ్లీలో తమ వాయిస్ ను వినిపించనీయకుండా చేస్తుండటంతో జగన్ ప్రజల మధ్యకే వచ్చి అసెంబ్లీ కన్నా ధాటిగా మాట్లాడారు.

ఇలా జగన్ ప్రజలకు చేరువ అయ్యాడు. వారి విశ్వాస పాత్రుడు అయ్యాడు. ఒక విశ్వసనీయమైన వ్యక్తి అయ్యాడు జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఎన్నికల్లో వైఎస్ ఆర్సీపీ నెగ్గడం ఖాయమని - జగన్ ముఖ్యమంత్రి కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ ఊపు వస్తుండటం విశేషం. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిలో డెవలప్ మెంట్ అద్భుతంగా ఉంటుదని, భారీగా పెట్టుబడులు కూడా వస్తాయని ప్రజలు భావిస్తూ ఉన్నారు. తాము అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చేది ఉండదని జగన్ స్పష్టం చెప్పారు. అలాగే బలవంతపు భూ సేకరణలు కూడా ఉండవని తేల్చి చెప్పారు.

ఇలాంటి నేపథ్యంలో అక్కడ రియలెస్టేట్ ఊపు వస్తోందని తెలుస్తోంది. ఫలితాలకు ముందే ఈ ప్రభావం కనిపిస్తోందని అమరావతి ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు.
Tags:    

Similar News