నిత్యానంద వారి కైలాస్ అంతా మాయేనట

Update: 2019-12-07 06:30 GMT
సంచలనాలు.. వివాదాలు.. కేసులతో తరచూ వార్తల్లోకి వచ్చే వివాదాస్పద స్వామీజీ నిత్యానంద ఏకంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేశారన్న వార్తలు భారీ ఎత్తున రావటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతం పెద్ద చర్చకే తెర తీసింది. ఈక్వెడార్ దేశం నుంచి కొనుగోలు చేసిన చిన్న ద్వీపంలో తన కలల దేశాన్ని ఏర్పాటు చేశారని.. దానికి కైలాస్ అనే పేరు పెట్టటంతో పాటు.. ఆ దేశంలో పౌరుడిగా ఉండాలంటే ఏమేం చేయాలన్న విషయాలతో పాటు.. తన దేశం ఎలా ఉంటుంది? ఎలా నడుస్తుంది? లాంటి వివరాల్ని ఆయనకు చెందిన వెబ్ సైట్ లో ఏర్పాటు చేశారు.

దీన్ని చూసిన జాతీయ..  ప్రాంతీయ మీడియాలు కథనాలు వండి వార్చేశాయి. ఈ కథనాలు అంతర్జాతీయ మీడియాలోనూ పబ్లిష్ కావటంతో ఈక్వెడార్ సీన్లోకి వచ్చింది. కైలాస్ ను తమ నుంచి కొనుగోలు చేసిన భూభాగంలో నిత్యానంద ఏర్పాటు చేసిన కథనం పూర్తిగా పచ్చి అబద్ధంగా తేల్చేశారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను తమ దేశంలో ఆశ్రయం ఇచ్చినట్లుగా వస్తున్న వార్తల్లోనూ నిజం లేదన్నారు.

తమ దేశంలో శరణార్దిలా ఉండేందుకు అప్లికేషన్ పెట్టుకున్నారని.. కానీ తాము రిజెక్టు చేశారని స్పష్టం చేశారు. నిత్యానంద వారి కైలాస దేశానికి సంబంధించిన పైత్యం మొత్తం ఆయనకు చెందిన వెబ్ సైట్లో సమాచారం ఆధారంగా తీసుకొన్న మీడియా.. వెనుకా ముందు చెక్ చేసుకోకకుండా కథనాలు వండేశారు. తాజాగా ఈక్వెడార్ సీన్లోకి వచ్చి జరిగిందంతా చెప్పటంతో నిత్యానంద అందరిని ఎంతలా ఎటకారం చేశారో అర్థమైన పరిస్థితి. ఇంతమందిని ఫూల్స్ ను చేసిన నిత్యానంద ప్రస్తుతం హైతీలో ఉండి ఉండొచ్చంటున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా నిత్యానంద వారి కైలాస్ పెద్ద బుస్సు అన్నది మాత్రం నిజం.
Tags:    

Similar News