అమెరికా అంటే భూతల స్వర్గం. అక్కడ చదువుకోవడం... అక్కడ ఉద్యోగం చేయడం.. అక్కడ నివసించడం... అక్కడ తమ కలలు పండించుకోవడం... అన్నీ భారతీయులకు ప్రీతిపాత్రమే. అందుకే లక్షలాది మంది భారత యువత అమెరికా అంటే పడి చస్తారు. కానీ, ఇప్పుడు వారి కలలన్నీ కల్లలవుతున్నాయి. భారత్ నుంచి వస్తున్న విద్యార్థుల ఆధారంగా పెద్దమొత్తంలో ఆర్జిస్తున్న అమెరికా ఇప్పుడు వారికి ఉద్యోగాలు చేసుకోకుండా నానా ఇబ్బందులు పెడుతోంది. ఆంక్షలు పెట్టి ఆత్మహత్యలకు పురికొల్పుతోంది. అనుమతి లేని యూనివర్సిటీల్లో చేరుతున్నారంటూ వందలాది మంది విద్యార్థులను విమానాశ్రయాల నుంచే వెనక్కి తిప్పిపంపుతోంది. ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారినీ నిబంధనల సాకుతో రాచిరంపాన పెడుతోంది. వీసా నిబంధనలు కఠినతరం చేసి దెబ్బతీస్తోంది.
పూర్తిస్థాయి ఉద్యోగం ఇస్తామని అమెరికా కంపెనీలు ఆఫర్ లెటర్ ఇస్తేనే హెచ్1బీ వీసా లాటరీకి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామంటూ పెట్టిన మెలికతో... అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులు, తాత్కాలిక ఉద్యోగాల్లో పనిచేస్తున్నవారు బెదిరిపోతున్నారు. ఇంతకుముందు తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నవారూ హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడది లేదు. కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే దాదాపు ఆరు నెలలుగా అమెరికాలోని భారత విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగం సంపాదించేందుకు నకిలీ అనుభవం సర్టిఫికెట్ పెడుతున్నారని.. అదే వారి కొంప ముంచుతోందని కన్సల్టెన్సీ నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ఎంఎస్ పూర్తిచేసి నాలుగైదేళ్లు ఉద్యోగ అనుభవం ఉన్నట్లుగా సర్టిఫికెట్ ఇచ్చేవారంతా చిక్కులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు. చదువు పూర్తి కాగానే తక్కువ వేతనంతో అయినా ఉద్యోగంలో చేరి వారి ప్రతిభను నిరూపించుకుంటే చిక్కులు ఉండవని... అలాగాకుండా వెంటనే భారీ వేతనం కావాలని ఆశపడేవారికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. క్యాంపస్ ఉద్యోగాలు దక్కించుకున్న వారికి ఇలాంటి చిక్కులేమీ ఉండవని కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికా తాజా చర్యతో మంచి విద్యార్థులకు నష్టం లేదని, ఏదో ఒక ఉద్యోగం చేయాలని వచ్చేవారికే ఇబ్బందులని చెప్తున్నారు. అంతేకాదు... ప్రతిభ ఉన్న వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అమెరికా కంపెనీలు సిద్ధంగా ఉన్నా వేతనాలు మాత్రం తక్కువగా ఆఫర్ చేస్తున్నాయట.
అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన వందలాది మంది భారత విద్యార్థులను అమెరికా విమానాశ్రయాల నుంచే వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. కొత్తగా వెళ్లేవారినే కాదు.... అక్కడ హెచ్1బీ వీసాతో ఉద్యోగం చేస్తూ.. సెలవులకు స్వదేశం వచ్చి తిరిగి వెళుతున్నవారిని కూడా అమెరికా అధికారులు తిప్పిపంపుతున్నారు. నవంబర్ - డిసెంబర్ నెలల్లో భారత్ కు చెందిన 113 మంది ఉద్యోగులు విమానాశ్రయాల నుంచే వెనక్కి రావాల్సి వచ్చింది. దీంతో అక్కడున్న వారు ఇండియాకు వస్తే తిరిగి అమెరికా వెళ్లగలమో లేదో అని ఆందోళన చెందుతున్నారు.
అయితే... అమెరికా కేవలం భారత్ పట్లే ఇలా ఉంటుందా అంటే కాదనే చెప్పాలి. అన్ని దేశాలకు చెందినవారిని తిప్పిపంపుతున్నారు. అయితే.. వెనక్కి పంపుతున్నవారిలో దక్షిణాసియా వారే అధికంగా ఉన్నట్లు సాక్షాత్తు అమెరికా మీడియాయే కథనాలు రాస్తోంది.
అమెరికా ఎందుకిలా మారిపోయింది... ప్రపంచ పెద్దన్న ఎందుకింత కఠినంగా ఉంటోందంటే కారణం... ఎన్నికలు. అవును... ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వలస విధానాన్ని కఠినంగా అమలు చేస్తూ అమెరికన్లకు భరోసా కల్పించే ప్రయత్నమిది. దీందతో భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు అన్ని నిబంధనలు పాటించి... మంచి విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుని... ఆర్థిక వనరులకు సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకుంటే ఇబ్బంది ఉండదు.. లేదంటే కష్టాలు తప్పవు. వచ్చే ఆర్నెళ్లలో పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయి కాబట్టి అమెరికా వెళ్లే విద్యార్థులు అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే బెటర్.