అత‌డికి మంత్రి ప‌ద‌వి భీమిలి సెంటిమెంటేనా?

Update: 2019-06-08 07:57 GMT
కొన్ని సెంటిమెంట్లు భ‌లేగా ఉంటాయి. పాపుల‌ర్ కాని ఈ త‌ర‌హా న‌మ్మ‌కాలు.. త‌ర‌చూ నిజ‌మ‌వుతూ ఉంటాయి. తాజాగా చెప్పేది అలాంటిదే. భీమిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నికైతే చాలు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌న్న సెంటిమెంట్ ఒక‌టి ఉంది. తాజాగా ఈ సెంటిమెంట్ నిజ‌మ‌ని తేలింది.

తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భీమిలి అసెంబ్లీ నుంచి బ‌రిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి గెలుపొందిన అవంతి శ్రీ‌నివాస‌రావుకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌టంతో ఈ సెంటిమెంట్ మ‌రోసారి నిజ‌మైంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. 2014లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన గంటా శ్రీ‌నివాస‌రావు విద్యామంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌టం తెలిసిందే.

ఈ సెంటిమెంట్ ఇప్ప‌టిది కాద‌ని.. 1964 నుంచి ఉంద‌ని చెబుతారు. భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన  పీవీజీ రాజు 1964లో విద్యాశాఖా మంత్రిగా ప‌ని చేశారు. 1982లో పీవీజీ రాజు కుమారుడు.. ఆనంద‌గ‌జ‌ప‌తి రాజు ఎన్టీఆర్ మంత్రివ‌ర్గంలో  ప‌ని చేశారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన అప్ప‌ల న‌ర‌సింహ‌రాజు 1989లో ఎక్సైజ్ శాఖామంత్రిగా ప‌ని చేశారు. ఇలా భీమిలి నుంచి బ‌రిలో దిగి గెలుపొందిన అధికార‌పార్టీకి చెందిన ప‌లువురు మంత్రి ప‌ద‌వుల్ని చేప‌ట్టారు. తాజాగా అవంతి ఆ జాబితాలో చేర‌టంతో ఈ సెంటిమెంట్ మ‌రోసారి నిజ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News