ఆ డీల్ తోనే బిల్ గేట్స్ మళ్లీ నెంబర్ అయ్యారా?

Update: 2019-11-17 09:07 GMT
డెబ్బైల నుంచి తొంభైల ప్రారంభంలో పుట్టిన వారి వరకూ ప్రపంచంలో అత్యంత సంపన్నుడన్న ట్యాగ్ లైన్ ఎవరిదంటే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చెప్పేశారు. ఆ తర్వాతి కాలంలో తాను సంపాదించిన సంపదలో పెద్ద ఎత్తున దానధర్మాలకు వెచ్చించంటంలో నెంబర్ వన్ స్థానం నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు అమెజాన్ అధినేత బెజోన్ లాంటోళ్ల కారణంగా నెంబర్ వన్ టైటిల్ ను చేజార్చుకున్నారని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మరోమారు ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడన్న ట్యాగ్ లైన్ ను మళ్లీ సొంతం చేసుకున్నారు. తాజాగా బిల్ గేట్స్ సంపద రూ.7.7లక్షల కోట్లకు చేరుకున్నట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. గేట్స్ సంపద ఇలా పెరుగుతుంటే..మరోవైపు ఆయన స్థానాన్ని గతంలో చేజిక్కించుకున్న అమెజాన్ అధినేత బెజోన్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

కుర్ర గర్ల్ ఫ్రెండ్ తో రిలేషన్ పుణ్యమా అని భార్యకు విడాకులు ఇవ్వాల్సిన నేపథ్యంలో.. భరణం రూపంలో ఆమెకు తన సంపదలో నాలుగో వంతు మొత్తాన్ని ఆమెకు చెల్లించాల్సి వచ్చింది. దీంతో.. ఆయన సంపద తరిగింది. అదే సమయంలో..  అమెజాన్ షేర్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో తరచూ అమెజాన్ షేర్ ధరలో క్షీణత చోటు చేసుకుంటోంది.

ఇలాంటివేళలోనే మైక్రోసాఫ్ట్ కు వచ్చిన భారీ డీల్ గేట్స్ ను నెంబర్ వన్ సంపన్నుడిగా మార్చిందని చెప్పాలి. అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టు దక్కింది. దీని విలువ ఏకంగా రూ.70వేల కోట్లు. ఈ విషయాన్ని అక్టోబరు 25న అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఇంత భారీ డీల్ వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ షేరు ధర అంతకంతకూ దూసుకెళుతోంది. ఈ డీల్ ఆయన్ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడ్ని చేసిందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News