తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ చాలా చెత్తగా ఓడిపోయింది. నాయకులు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలి వీచిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ కేసీఆర్ వ్యూహాత్మక ఎన్నికల ఎత్తుగడలే ఆ పార్టీని విజయతీరాలకు చేర్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తమ ఓటమిని నిజాయితీగా సమీక్షించుకోవాల్సిన బీజేపీ నేతలు ఇప్పుడు కొత్త కారణాన్ని వెతికి పట్టుకున్నారు.
హైదరాబాద్ నాంపల్లి లోని బీజేపీ కేంద్ర కార్యాలయం లో మూడో అంతస్తులో ఉన్న వాస్తు సరిగా లేని బాత్రూం ల వల్లే బీజేపీ ఓడిపోయిందని చెబుతున్నారు. ఓటమికి బాధ్యతను తమ పై వేసుకొని బేరీజు వేసుకోవాల్సిన నేతలు ఇలా బాత్రూం- వాస్తు అంటూ కుంటిసాకులు వెతకడం ఆ పార్టీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది.
తెలంగాణ బీజేపీ లోని కొందరు కీలక నేతలు నాంపల్లిలోని కేంద్ర కార్యాలయంలోని ఆ బాత్రూం నుంచి వింత శబ్ధాలు వెలువడుతున్నాయని.. వాస్తు ప్రకారం అది అక్కడ ఉండరాదని వాదిస్తున్నారు. తెలంగాణ లో బీజేపీ ఓటమి కి ఆ బాత్రూమే కారణమని వాదిస్తున్నారట.. ఈ గదులను ధ్వంసం చేసి వాస్తు ప్రకారం సరిదిద్దితే తెలంగాణ లో బీజేపీకి మహర్ధశ పడుతుందని చెబుతున్నారు.
బీజేపీ పార్టీని కాపాడుకునేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాల్సిందిపోయి ఇలా వాస్తు- బాత్రూం కారణమని వాదించడం వెర్రితనమే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి.? ఎలా ముందుకెళ్లాలని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన నేతలు ఇలా బాత్రూం వెంట పడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.