చంద్రబాబుకు నచ్చని ఆ రెండు మాటలు

Update: 2015-03-17 09:35 GMT
సంఘాలు, రాజకీయ పార్టీలు తమ ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు, ర్యాలీల సమయంలో నినాదాలు చేయడం సహజం. అనుకూల నినాదాలైతే ''జిందాబాద్‌.. జిందాబాద్‌'' అని.. వ్యతిరేకంగా అయితే ''డౌన్‌.. డౌన్‌..'' అని అనడం సహజం. అయితే, కొందరు నేతలకు మాత్రం ఇందులో జిందాబాద్‌లే తప్ప డౌన్‌డౌన్‌ అనేవి అస్సలు ఇష్టం ఉండదు. ఆ మాట వింటే చాలు మండిపడతారు.

    ఏపీ సీఎం చంద్రబాబుకు అస్సలు నచ్చని మాటలు కొన్ని ఉన్నాయి... ఎవరైనా ఆ మాట అంటే చాలు ఆయన ఉగ్రనరసింహుడైపోతారు. ఆయన వద్ద అస్సలు అనకూడని మాటల్లో మొదటిది ''హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబు కాదు'' అన్న మాటయితే... రెండోది ''డౌన్‌.. డౌన్‌..''. ఈ రెండిట్లో ఏది విన్నా ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఈ సంగతి తెలుసో తెలియదో కానీ వైసీపీ నాయకులు మాత్రం మంగళవారం అసెంబ్లీలో చంద్రబాబును ''డౌన్‌ డౌన్‌'' అన్నారు. ఇక చెప్పేదేముంది.. ''నన్ను డౌన్‌డౌన్‌ అంటారా'' అంటూ చంద్రబాబుకు చెప్పలేనంత కోపమొచ్చింది.. ఎప్పుడూ లేని స్థాయిలో ఆయన తీవ్ర పదజాలంతో వైసీపీపి విరుచుకుపడ్డారు.

    దీంతో చంద్రబాబును ఏమైనా తిట్టచ్చు కానీ ఆ రెండు మాటలు మాత్రం అనరాదని వైసీపీ నేతలు అనుకుంటున్నారట.

Tags:    

Similar News