నాటకమైన మరో కళా ప్రక్రియ అయినా ప్రజలను రంజింపచేయడానికే తప్ప అందులో మరోటి ఏదీ ఉండదు. బూతద్దంతో చూస్తే మాత్రం అన్నీ మనం అనుకున్నట్లుగానే కనిపిస్తాయి. ఇదిలా ఉంటే తెలుగు నేల నాలుగు చెరగులా ఒకనాడు విజయవంతంగా ప్రదర్శితమైన ఒక అద్భుత నాటకానికి తెర పడిపోయింది. అదే చింతామణి నాటకం. ఈ నాటకం లో సారాంశం ఉంది, మంచి సందేశం ఉంది. వ్యసనాల బారిన పడితే జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా చూపించిన నాటకం ఇది.
దీనిని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాళ్ళకూరి నారాయణరావు అనే మహా కవి సరిగ్గా వందేళ్ళ క్రితం అంటే 1921లో రచించారు. చింతామణిలో హాస్యరసానిదే పెద్ద పీట. అలాగే కొంత శృంగారం పాలు ఉన్నా దానికి చవకబారుగా మార్చిన ఘనత తరువాత తరం వారిది. ఇక ఆనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ నాటకాన్ని రచించారు.
చెప్పుకోవాలీ అంటే వందేళ్ళ క్రితమే సమాజంలో నాగరికత ఇంకా ఎక్కువ దివ్యంగా ఉందనుకోవాలి. నాడు కులాలకు, మతాలకు పట్టింపు అంటారు కానీ ఇంతకంటే తక్కువే అని నాడు రచించిన అనేక నాటకాలు నిరూపించాయి. కన్యాశుల్కం తీసుకున్నా కొన్ని సామాజికవర్గాల ప్రస్థావన ఉంటుంది. అయితే ఎవరూ దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయలేదు.
అయితే ఇపుడు అన్నీ మారాయి. అన్నింటా రాజకీయం జొప్పించబడింది. దాంతో సినిమా అయినా మరో కళా ప్రక్రియ అయినా అందులో ఉన్న దాన్ని అన్వయించుకోవడం ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో చింతామణి నాటకాన్ని నిషేధించమని ఆర్య వైశ్యులు చాన్నాళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర వల్ల తమకు కళంకంగా ఉందని వారు భావిస్తున్నారు. దాంతో నాటకం ఎక్కడా ప్రదర్శించకుండా కోరుతున్నారు.
గతంలో రోశయ్య ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండగా ఈ ప్రతిపాదన వెళ్ళింది. నాడు ఆయన ఒక జీవో జారీ చేసినా కూడా అది అమలు కాలేదు. ఇక ఇపుడు జగన్ సర్కార్ ఈ నాటకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్య వైశ్య సంఘాలు పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ డిమాండ్ నెరవేరింది అని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఒక సందేశాత్మకమైన నాటకం, వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న దాన్ని నిషేధించడం పట్ల నాటక సమాజాల నుంచి కళాకారుల నుంచి, సాహితీ ప్రియుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ఇప్పటికి 450 సార్లకు పైగా ప్రదర్శితం అయిన అరుదైన ఘనత కలిగిన నాటకం ఇది. అంతే కాదు. ఈ నాటకానికి ఎంతో గ్లామర్ కూడా ఉంది. ఇక కాళ్ళకూరి వారి రచనా ప్రతిభ కూడా ఉంది. మరి అలాంటి సాహితీ సంపదను లేకుండా చేయడం మంచిది కాదేమో అన్న మాట వినిపిస్తోంది.
అయితే ఒంగోలులో గుప్తా అనే ఒక ఆర్య వైశ్య సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేతను వైసీపీకి చెందిన ఒక మైనారిటీ నాయకుడు దారుణంగా కొట్టడంతో ఆ వర్గం గుర్రుగా ఉంది. దాంతో వారిని మచ్చిక చేసుకునే క్రమంలోనే ఈ నిషేధాన్ని హుటాహుటిన అమలులోకి తెచ్చారని అంటున్నారు. మొత్తానికి రాజకీయాలు ప్రచారాలు ఏమైనా ఒక మంచి నాటకానికి శాశ్వతంగా తెర పడడం మాత్రం బాధగానే ఉంది అంటున్నారు .