ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీని ఇప్పటికిప్పుడు అమెరికా దళాలు ఎందుకు చంపినట్లు? 2016లో అతడ్ని లేపేసే అవకాశం లభించినా.. వదిలేసిన అమెరికా ఇప్పుడే ఎందుకు మట్టుబెట్టే ప్లాన్ ఎందుకు వేసింది? తాజాగా నిర్వహించిన రహస్య ఆపరేషన్ లో అమెరికా బలగాలకు చిక్కకుండా.. తాను.. తన భార్య.. ఇద్దరూ బాంబులు చుట్టేసుకొని తమను తాము పేల్చేసుకోగా.. ఇదే ఉదంతంలో ముగ్గురు పిల్లలు కూడా మరణించిన వైనం తెలిసిందే.
ఇదంతా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న వేస్తే.. అంత ఆరాచకవాదిని అంతమొందించే అవకాశం వస్తే ఎవరూ విడిచిపెట్టరు కదా? అని ప్రశ్న వినిపిస్తుంది.కానీ.. తరచి చూస్తే.. బాగ్దాదీని లేపేయటం వెనుక అసలు కథ వేరే ఉందని చెప్పాలి. బాగ్దాదీని లేపేసిన వైనాన్ని ట్రంప్ మాటల్లో విన్నంతనే.. అనుకోని రీతిలో ఒసామా బిన్ లాడెన్ గుర్తుకు రాక మానదు.
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన బరాక్ ఒబామా తాను పదవిని చేపట్టిన రెండేళ్లకే లాడెన్ ను లేపేసే ప్రోగ్రాంను సినిమాటిక్ గా డిసైడ్ చేయటం తెలిసిందే. తన మిత్రదేశమైన పాకిస్తాన్ లో తలదాచుకున్న లాడెన్ ను.. మెరుపువేగంతో నిర్వహించే సీల్స్ తో అంతమొందించటం తెలిసిందే. లాడెన్ మరణం తర్వాత బరాక్ ఒబామా ఇమేజ్ ఎంతలా పెరిగిందో తెలిసిందే. ఆ ఉదంతం ఆయన్ను అమెరికాకు సరికొత్త హీరోగా పరిచయం చేసింది.
ఆ తర్వాత ఆయన రెండోసారి అధ్యక్ష స్థానాన్ని నిలుపుకోవటంలో కీలకంగా మారింది. ఇదిలా ఉంటే.. బాగ్దాదీ మరణం వెనుకా ఇలాంటిదే ఉందన్న మాట వినిపిస్తోంది. ఐసిస్ సంస్థతో ప్రపంచానికి వణుకు పుట్టటంలో సక్సెస్ అయిన బాగ్దాదీని అంతమొందించే ప్లాన్ వెనుక అసలు కథ.. అమెరికా అధ్యక్ష ఎన్నికలని చెప్పేవారు లేకపోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి.. ఆ స్థానాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్న ట్రంప్.. అందుకు తగ్గట్లు అమెరికాలోని తన వ్యతిరేకుల మద్దతును సొంతం చేసుకోవటం కోసం బాగ్దాదీని లేపేసే ప్రోగ్రాంకు డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.
మరో ఏడాదిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఉగ్రవాద అధినేతను లేపేయటం ద్వారా.. తనను వ్యతిరేకించే వారి మనసుల్ని సైతం ట్రంప్ గెలుచుకున్నారని చెప్పాలి. అదే.. ఆయన్ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా చేయటంలో కీలకమవుతుందన్న మాట వినిపిస్తోంది. ప్రపంచంలో ఏదీ ఉచితంగా లభించదన్న మాటకు తగ్గట్లే.. ప్రపంచంలో ఏదీ కూడా ఉత్తనే.. ఊరికనే.. కీలక పరిణామాలు చోటు చేసుకోవు. దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందన్నది మర్చిపోకూడదన్నది బాగ్దాదీ మరణం స్పష్టం చేస్తుందని చెప్పకతప్పదు.