ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి మరణానికి అసలు కారణం అదే?

Update: 2022-08-02 04:52 GMT
ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య నందమూరి ఫ్యామిలీలో విషాదం నింపింది. తాజాగా తన తల్లి ఆత్మహత్యపై స్పందించిన ఉమామహేశ్వరి కూతురు దీక్షిత.. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను తెలిపింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది.

ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురు ఉన్నామని దీక్షిత తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారని.. అయితే భోజనం సమయం అయినా కూడా బయటకు రాకపోవడంతో తలుపులు తెరిచే ప్రయత్నం చేశామన్నారు. లోపలి నుంచి తలుపు గడియ పెట్టుకున్నారన్నారు.  తన తల్లి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో తన తండ్రితోపాటు తన భర్త కూడా ఉన్నట్లు దీక్షిత తెలిపింది.

ఇక తన ఆత్మహత్య చేసుకోవడానికి ఆరోగ్య సమస్యలే కారణమని దీక్షిత తెలిపింది.  అనారోగ్య కారణాలు, ఒంటరితనం, మానసిక ఒత్తిడి వల్లే చనిపోయినట్లు  తెలిపింది. ఉదయం భర్తను టిఫిన్ చేయమని చెప్పి గదిలోకి వెళ్లి ఉమామహేశ్వరి  ఆ తర్వాత గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

భర్త టిఫిన్ తీసుకొచ్చే సమయంలో లోపలకు వెళ్లి తలుపుకు బోల్డ్ పెట్టుకున్న ఉమా మహేశ్వరి ఉరివేసుకున్నట్లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పోస్టుమార్టం తర్వాతనే ఆమె ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు అందే అవకాశముంది..

ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి జీవితం ఒడిదుడుకుల మధ్య సాగింది. ఉమా మహేశ్వరిని నరేంద్రరాజన్ అనే వ్యక్తికి ఇచ్చి ఎన్టీఆర్ పెళ్లి చేశాడు. అయితే ఆయన చాలా సాడిస్ట్ గా ప్రవర్తించేవాడని.. సిగరెట్ తో కాల్చేవాడని ఉమా మహేశ్వరి వాళ్ల నాన్న అయినా.. ఎన్టీఆర్ కు అప్పట్లో చెప్పింది. దీంతో అతడితో విడాకులు ఇప్పించిన ఎన్టీఆర్ ఇంకో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రస్తుతం అతడితోనే ఉమామహేశ్వరి జీవిస్తోంది.

ఇక తన సోదరి మరణవార్త తెలిసిన వెంటనే సినీ హీరో బాలయ్య ఆమె ఇంటికి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, నందమూరి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు.
Tags:    

Similar News