గీతారెడ్డిది గొంతెమ్మ కోరికా?

Update: 2015-12-18 06:21 GMT
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి పరిస్థితులు తెలుసుకోకుండా బేరాలు ఆడుతున్నారు.. పాపం.. అందుకే ఆమె వచ్చిన అవకాశాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అసలే కాంగ్రెస్ నానా కష్టాల్లో ఉంటే, అలాంటి క్లిష్ట సమయంలో పిలిచి పార్టీలోకి తీసుకెళ్తామంటున్న టీఆరెస్ ముందు ఆమె తన కోరికల చిట్టా విప్పారట. దాంతో టీఆరెస్ నేతలు ఉండమ్మా మళ్లీ వస్తాం అని అక్కడి నుంచి వెళ్లిపోయారట.
   
టీఆర్‌ ఎస్‌ లో చేరుతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న గీతారెడ్డి కాంగ్రెస్ ను వీడుతారని ఇంతవరకు అంతా అనుకున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎల్పీ నిర్వహించిన సమావేశానికి కూడా గీతారెడ్డి హాజరుకాలేదు. దీంతో ఆమె పార్టీని వీడుతారనే అనుకున్నారు... కానీ, మళ్లీ ఆమె మనసు మార్చుకున్నట్లు సమాచారం. గీతారెడ్డి కాంగ్రెస్‌ ను వీడబోరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని అంటున్నారు. ఆమె అడిగిన పదవికి టీఆరెస్ నో చెప్పడంతో ఆమె ఆగిపోయారని అంటున్నారు.
   
గీతారెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు కేసీఆర్‌ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. పార్టీలోకి వస్తే మంచి గౌరవం  ఇస్తామని కూడా హామీ ఇచ్చారట. అయితే గీతారెడ్డి మాత్రం ఏకంగా డిప్యూటీ సీఎం పదవి అడిగారని టీఆరెస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు కేసీఆర్‌ నో చెప్పారట. దీంతో  గీతారెడ్డి మనసు మార్చుకున్నారని నిర్ణయించుకున్నారని అంటున్నారు.  టీఆరెస్ మాత్రం గీతారెడ్డి గొంతెమ్మ కోరికలు తీర్చి పిలవాల్సిన అవసరం లేదని టీఆరెఎస్ నేతలు అంటున్నారు.
Tags:    

Similar News