విశాఖలో జగన్ మౌనం.. దేనికి సంకేతం?

Update: 2019-12-29 05:15 GMT
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ ఉండాలని సీఎం జగన్ ప్రతిపాదించారు. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.కానీ విశాఖను వ్యతిరేకిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సహా ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. అయితే హైలెవల్ కమిటీకి రాజధాని ఎంపిక బాధ్యతను ఇస్తూ జగన్ ప్రస్తుతానికైతే విశాఖను సస్సెన్స్ లో పెట్టారు.

తాజాగా విశాఖ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ కు అపూర్వ రీతిలో ఊహించని స్వాగతం లభించింది. విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ప్రకటించడంతో విశాఖ వాసులు అక్కున చేర్చుకున్నారు. 21 కి.మీల మేర జగన్ కు మానవహారంగా ఏర్పడ్డారు. పూలు జల్లి స్వాగతం పలికారు. శనివారం ఏడు జీవోల ద్వారా భారీగా నిధులు విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో జగన్ ను నెత్తిన పెట్టుకున్నారు.

ఇక జగన్ ఇచ్చిన గిఫ్ట్ తో పులకించిన విశాఖ వాసులు ‘విశాఖ ఉత్సవ్’ లో జగన్మామ స్మరణ చేశారు. జగన్ పై షార్ట్ వీడియోలు, ఏవీలు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటారు.

అయితే అనూహ్యంగా విశాఖ ఉత్సవ్ లో సీఎం జగన్ నోరు విప్పకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖ వేదికగా ఆయన ప్రసంగిస్తారని అందరూ భావించారు. కానీ మాట్లడలేదు. ఆయన మౌనం వెనుక కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ చర్చ మొదలైంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేసిన జగన్ ఆ విషయాన్ని విశాఖలో ప్రకటిస్తారని ఏదైనా చెబుతారని ఆశించారు. ప్రభుత్వం తరుఫున ఏదైనా ప్రకటిస్తారని భావించారు. దానికి విరుద్ధంగా ఆయన మౌనం వహించడంతో మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా అన్న టెన్షన్ మొదలైందిప్పుడు..

ఇక విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కూడా జగన్ మౌనం వెనుక కారణంగా చెబుతున్నారు. ‘చంద్రబాబు న్యాయవ్యవస్థ ద్వారా విశాఖను రాజధాని కాకుండా కుట్రలు పన్నుతూ అడ్డుకుంటున్నారు’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మరి కేంద్రం విశాఖకు మోకాలడ్డిందా? చంద్రబాబు కుట్ర పన్నారా? అసలు సీఎం జగన్ మౌనం వెనుక అర్థమేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

   
Tags:    

Similar News