సెల్ ఫోన్ బంద్ చేసిన జేసీ!

Update: 2018-06-06 07:03 GMT
త‌న మాట‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కే ఏపీ నేత‌గా జేసీ దివాక‌ర్ రెడ్డిని చెప్పాలి. మ‌న‌సులో అనుకున్న మాట‌ను మాట‌ల్లో చెప్పేయ‌టం.. ఎదుట ఎవ‌రున్న‌ద‌న్న‌ది ఎంత‌మాత్రం ముఖ్యం కాద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం జేసీకి అల‌వాటు. కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లుగా మీడియాతో మాట్లాడే జేసీతో మాట క‌ల‌ప‌టానికి.. మైకులు ఆయ‌న ముందు పెట్ట‌టానికి టీవీ ఛాన‌ళ్ల రిపోర్ట‌ర్లు చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు.

జేసీ నోరు విప్పితే ఒక స్టోరీ అయిపోయిన‌ట్లే అన్నట్లు ఉంటుంది. ఇటీవ‌ల నిర్వ‌హించిన మ‌హానాడులో ఊహించ‌ని రీతిలో అంద‌రి ఎదుట చంద్ర‌బాబుకు ఆయ‌న చేసిన హిత‌బోధ కాస్త ఇబ్బందిగా అనిపించినా.. ఉన్న వాస్త‌వాల్ని ఉన్న‌ట్లుగా చెప్పార‌ని చెప్పాలి. బాబు చేసే త‌ప్పుల్నిఎత్తి చూపించేందుకు సాహ‌సించ‌ని తెలుగు త‌మ్ముళ్ల తీరుకు భిన్నంగా ఆయ‌న ఓపెన్ గా మాట్లాడేయ‌టం ద్వారా జేసీ అనుస‌రించిన వ్యూహాన్ని త‌ప్పు ప‌ట్టే వారెంద‌రో.. రైట్ అంటూ స‌మ‌ర్ధించి.. ప్ర‌శంసించే వారు అంతే ఎక్కువ‌గా ఉన్నార‌ని చెప్పాలి.

నాలుగు గోడ‌ల మ‌ధ్య చెప్పాల్సిన మాట‌ను న‌లుగురి ఎదుట చెబుతారా? అన్న విమ‌ర్శ‌ను చేస్తున్నారు.. జేసీ మ‌నోగ‌తాన్ని స‌రిగా అర్థం చేసుకోలేద‌ని చెప్పాలి. నాలుగు గోడ‌ల మ‌ధ్య‌న చెబితే బాబు త‌న తీరును మార్చుకోరు. అదే అంద‌రి ముందు చెబితే.. ఆయ‌న త‌న తీరు మార్చుకోక త‌ప్ప‌నిస‌రి. అందుకే.. బాబు ద‌గ్గ‌ర వ్యూహాత్మ‌కంగా ఆయ‌న త‌ప్పుల్ని ఎత్తి చూపిన జేసీ తీరును ప‌లువురు అభినందిస్తున్నారు.

జేసీ ఎఫెక్ట్ తో బాబు త‌న స‌మీక్ష‌ల్ని త‌గ్గించుకోవ‌ట‌మే కాదు.. ఒక రోజుకు కుదించుకున్న వైనం పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది. దీంతో.. జేసీ ఇమేజ్ మ‌రింత పెరిగిందంటున్నారు. ఓపెన్ స్టేజ్ మీద అదే ప‌నిగా అధినేత‌ను పొగ‌డ‌టం మానేసి..పార్టీకి.. బాబుకు మేలు చేసే సూచ‌న‌ల్ని చేసిన జేసీ తీరును అభినందించేందుకు టీడీపీ నేత‌లు పోటీ ప‌డుతున్న‌ట్లు చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో అంద‌రికి క‌నిపించేలా జేసీ వ‌ద్ద‌కు వ‌చ్చి ఆయ‌న్ను అభినందించ‌టం కాకుండా.. ఫోన్లో ఆయ‌న‌కు అభినంద‌న సందేశాల్నివినిపిస్తున్నార‌ట‌. ఇది అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో జేసీ.. త‌న సెల్ ఫోన్ ను బంద్ చేసి ఉంచిన‌ట్లుగా తెలుస్తోంది. లోక‌ల్ నెంబ‌ర్ ను ఆపేసిన జేసీ.. త‌న ఢిల్లీ నెంబ‌ర్‌ ను మాత్రం యాక్టివ్ గా ఉంచిన‌ట్లుగా స‌మాచారం.


Tags:    

Similar News