క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకొనే తెలుగుదేశం పార్టీలో ఇటీవల తెరమీదకు వచ్చిన కేబినెట్ మంత్రి రావెల కిశోర్ బాబు - గుంటూరు జెడ్‌పీ చైర్ పర్సన్ జానీమూన్ వివాదం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య వివాదం ఇప్పుడు తెరమీదకు వచ్చినప్పటికీ ఇందుకు మూలకారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన 2014లో ఫలితాల అనంతరం జెడ్పీ ఛైర్ పర్సన్ పదవికి ఇద్దరు టీడీపీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కాకుమాను జెడ్ పిటిసి షేక్ జానీమూన్ కు మొదటి రెండున్నరేళ్లు - మలి విడత అమృతలూరు జెడ్ పిటిసి పృథ్వీలతకు అవకాశం ఇవ్వాలని తొలుత నిర్ణయించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈమేరకు పృథ్వీలతకు ఆశలు కల్పించారు.
ఈ అంగీకారం ప్రకారం నియమిత గడువు ముగిసిన నేపథ్యంలో ఆరు నెల్లుగా పృథ్వీలత గ్రూపువారు మంత్రులు - ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. అయితే వారు చూద్దామని హామీలు ఇస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి రావెల కిషోర్ బాబుకు జెడ్ పి చైర్ పర్సన్ జానీమూన్ కు మధ్య వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. ఒక దశలో మంత్రి రావెల గ్రూపువారు జూనీమూన్ ఇంటిపై దాడి చేసే వరకూ వెళ్లారు. పృథ్వీలతకు రావెల కిషోర్ బాబు అంతర్గతంగా మద్దతు పలుకుతున్నారని తెలిసి జిల్లాలోని ఒక గ్రూపు నాయకులు దీనిపై తీవ్రంగా చర్చించింది. రావెల వేగానికి కళ్లెం వేసేందుకు జానీమూన్ తో జిల్లా ఎస్పీకి వారే ఫిర్యాదు చేయించారనే ప్రచారం ఉంది. ఈ ఘటనపై పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం, త్రిసభ్య కమిటీని నియమించడం చకచకా జరిగాయి. అయితే ఈ కమిటీ జిల్లాకు రాలేదు! ఈ లోగా మంత్రులు పత్తిపాటి పుల్లారావు - పల్లె రఘునాథరెడ్డి - టీడీపీ జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు గుంటూరులో సమావేశమై జెడ్ పి ఛైర్ పర్సన్ ను పిలిపించి రాజీ చేశారు.
ఈ సందర్భంగా మరో ట్విస్ట్ నెలకొంది. జెడ్పీ ఛైర్ పర్సన్ పదవి అంశంలో ఎవరికి ఒప్పందాలు జరగలేదనీ, రెండున్నరేళ్ల తరువాత మార్పు ఉంటుందని ఎక్కడా చర్చ జరగలేదనీ మంత్రి పుల్లారావు చెప్పారు. దీంతో పృద్వీలత వర్గం ఒక్కసారిగా షాక్ కు లోనైంది. అయితే పార్టీలో జరుగుతున్న ఈ రచ్చ ప్రభావం రాష్ట్రంలో ఇతర స్థానిక సంస్థల అంశంలోనూ తలెత్తె అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. మంత్రి రావెల మీద పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం - తదనంతర పరిణామాలతో జానీమూన్ తన పదవి మార్పిడిపై ప్రచారానికి తాత్కాలికంగా తెరదించగలిగారు. ఇంతటితో ఈ వివాదం సద్దుమణుగుతుందా? లేదా మళ్లీ పదవి మార్పిడిపై ఇతర నేతలు స్పందిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/