కబాలికి సూపర్ స్టార్ కూతురి దెబ్బ

Update: 2016-05-05 04:44 GMT
కబాలి.. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ఇది. టీజర్ తోనే సెన్సేషన్స్ స్టార్ట్ చేసిన ఈ సినిమాకి.. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ బోలెడంత క్రేజ్ ఉంది. అయితే ఇప్పటివరకూ ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ రైట్స్ విషయం తేలలేదు. ఆ డిస్ట్రిబ్యూటర్ - ఈ బయ్యర్ పోటీ పడుతున్నారంటూ వార్తలొస్తున్నాయి కానీ.. ఒక్క డీల్ కూడా ఫైనల్ కావడం లేదు. దీనికి కారణం.. రజినీకాంత్ కూతురే అని తెలుస్తోంది.

అప్పట్లో రజినీ.. తన కూతురు సౌందర్య దర్శకత్వంలో ఓ సినిమా చేశారు. కొచ్చాడయాన్ అని, తెలుగులో విక్రమసింహ అని రిలీజ్ అయింది ఈ మూవీ. సూపర్ స్టార్ కెరీర్ మొత్తంలో చెరుపుకోలేని మచ్చగా మిగిలిపోయింది విక్రమసింహ. ఈ మూవీకి వచ్చిన నష్టాలకు గాను రూ.7 కోట్లను తిరిగి చెల్లిస్తామని టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకు చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా తిరిగి రాలేదు.

ఇప్పుడు కబాలి రిలీజ్ సమయంలో వీరంతా అప్పటి అమౌంట్ గురించి పట్టుబడుతున్నారు. వీలైతే కబాలి రిలీజ్ ను కూడా అడ్డుకునేందుకు ట్రై చేస్తున్నారు. రజినీకాంత్ కు ఓ పిటిషన్ కూడా పంపబోతున్నారని తెలుస్తోంది. ఈ గొడవ కారణంగానే కబాలి తెలుగు వెర్షన్ కు డిమాండ్ ఉన్నా డీల్ మాత్రం సెట్ కావడం లేదని తెలుస్తోంది. మరి ఈ ఇష్యూని సూపర్ స్టార్ రజినీ ఎలా సెటిల్ చేసుకుంటారో!
Tags:    

Similar News