బీజేపీ జాతీయ అధ్యక్షుడి మూడు రోజుల తెలంగాణ రాష్ట్ర పర్యటన చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చేసింది. తిరుగులేని అధిక్యతతో.. తెలంగాణలో తనకు తప్ప మరెవరికీ ఛాన్స్ లేదన్న మాటలు చెప్పే టీఆర్ఎస్ లో నిజంగానే ఆ నమ్మకం ఉందా? అన్న ప్రశ్న తలెత్తేలా పరిణామాలు చోటు చేసుకోవటం విశేషంగా చెప్పాలి. తెలంగాణ చాంఫియన్లుగా తమను తాము అభివర్ణించే గులాబీ నేతలకు.. ఇకపై అలాంటి అవకాశం ఉండదేమో. ఊహించని రీతిలో గళం విప్పిన సీఎం కేసీఆర్ మాటలు చూస్తే.. తాజా అమిత్ షా పర్యటన ఆయన్ను ఎంతగా ఇరిటేట్ చేసిందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసింది.
తన ప్రెస్ మీట్ తోనే అమిత్ షా మూడు రోజుల పర్యటనను విజయవంతమైందన్న భావనను సీఎం కేసీఆర్ కలుగజేసినట్లుగా కమలనాథులు ఫీలవుతున్నారు. అంతేనా.. తర్వాతి రోజున ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి హరీశ్ రావు మాటల్ని విన్నప్పుడు.. అది నిజమన్న భావన కలగటం ఖాయం. ఎందుకంటే.. అమిత్ షా మాటలకు మేనమామ హర్ట్ అయిన విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పటం గమనార్హం.
ఎప్పుడూ లేని రీతిలో కేసీఆర్ అంతలా హర్ట్ కావటానికి కారణం ఏమిటి? అన్నది చూస్తే ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. కేంద్రంతో ఘర్షణ పూరిత వాతావరణాన్ని కేసీఆర్ కోరుకోకున్నా.. అందుకు భిన్నంగా బీజేపీ నేతలు రాష్ట్రాన్ని టార్గెట్ చేయటం.. పవర్ ను చేజిక్కించుకోవటమే తమ అంతిమ లక్ష్యంగా పదే పదే ప్రకటించటం కేసీఆర్ లాంటి నేతకు ఇబ్బంది పెట్టేదే.
తన అధిపత్యం ఉన్న చోట వేరెవరూ మాట్లాడకూడదన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. సామ దాన బేధ దండోపాయాలతో తాను అనుకున్నది ఇంతకాలం సమర్థవంతంగా సాధించుకున్నారు. అందుకు భిన్నంగా తాజాగా అమిత్ షా.. మోడీ రూపంలో ఆయనకు సవాలు ఎదురయ్యేసరికి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. బలాన్ని.. ప్రజాదరణను ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు తనకున్న ఇమేజ్ తో పోలిస్తే.. మోడీ ఇమేజ్ ఎన్నో రెట్లు ఎక్కవన్నది మర్చిపోకూడదు. అదే ఆయన్ను ఇరిటేట్ చేస్తుందని చెప్పాలి.
మోడీ ఢిల్లీకే పరిమితమై.. తెలంగాణ రాజకీయాల వైపు కన్నెత్తి చూడకపోతే విషయం మరోలా ఉంటుంది. కానీ.. తెలంగాణ తమ తదుపరి లక్ష్యమని.. అధికారంలోకి రావటం ఖాయమంటూ తేల్చి చెబుతున్న కమలనాథుల మాటలు కేసీఆర్ కు ఇరిటేట్ చేయకుండా మరేం చేస్తాయి? అందుకే.. ఆయన తన తీరుకు భిన్నంగా అమిత్ షా పర్యటనకు.. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడారు. నిజానికి కేసీఆర్ చిరాకు పడిపోవటం ఆయన వైఫల్యంగా పలువురు అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి కేసీఆర్ ఇలా ఇరిటేట్ కావటమే బీజేపీ నేతలకు కావాల్సింది. తమ తీరుతో కేసీఆర్ కు మండిపోయేలా చేసి.. ఆయన్ను మాట్లాడించి మైలేజ్ సాధించాలన్న లక్ష్యం సాకారమైందన్న భావనలో తెలంగాణ బీజేపీ నేతలు ఉండటం గమనార్హం. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని ఖర్చు చేసే విషయంలో తెలంగాణ సర్కారు విఫలమైందన్న అమిత్ షా వ్యాఖ్య కంటే కూడా.. వారసత్వ రాజకీయాల గురించి ఆయన చేసిన మాటలే కేసీఆర్ ను సూటిగా తాకాయని చెబుతున్నారు.
తన నేపథ్యం గురించి.. ప్రధాని మోడీ నేపథ్యం గురించి చెప్పటమే కాదు.. భవిష్యత్తులో తమ పార్టీ వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించదన్న విషయాన్ని స్పష్టం చేయటం కేసీఆర్ కు మండిపోయేలా చేసిందంటున్నారు. అలా అని ఆ విషయాల్ని నేరుగా ప్రస్తావించలేని పరిస్థితి. అందుకే.. తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్‌ను అడ్డు పెట్టుకొని మాట్లాడారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. తన పర్యటనతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరిటేట్ చేసేలా చేసి.. ఆయన బ్యాలెన్స్ మిస్ అయ్యేలా చేయటంలో అమిత్ షా అంటే కో సక్సెస్ అయ్యిందని చెప్పక తప్పదు. అయితే.. ఈ విషయాన్ని గులాబీ నేతలు తమ మాటలతో కొట్టి పారేస్తున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం కేసీఆర్ ఇరిటేషన్ ఒక చర్చగా మారిందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/