యూపీకి కేసీఆర్ ఎందుకు వెళ్ల‌న‌ట్లు?

Update: 2018-04-29 12:30 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లోనూ.. తెలుగు ప్ర‌జ‌ల్లోనూ ఇప్పుడో అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ఫెడ‌ర‌ల్ ప్రంట్ ఏర్పాటు గురించి అదే ప‌నిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌స్తావించ‌టం తెలిసిందే. తాను చెబుతున్న ఫ్రంట్ ఏర్పాటు కోసం తాను వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న కేసీఆర్‌.. అనూహ్యంగా యూపీ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ ను మాత్రం హైద‌రాబాద్‌కు రావాల‌ని ఆహ్వానించిన‌ట్లుగా చెబుతున్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్ కు త‌న‌కు తానే స్వ‌యంగా వెళ్లిన కేసీఆర్‌.. త‌ర్వాత క‌ర్ణాట‌క‌.. తాజాగా త‌మిళ‌నాడు వెళ్లిన కేసీఆర్‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు మాత్రం వెళ్లేందుకు మ‌క్కువ ప్ర‌ద‌ర్శించ‌లేద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి దేశ రాజ‌కీయాల్లో ప్ర‌భావం చూపేది.. అత్య‌ధిక సీట్లు ఉన్న‌ది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనే. ఏదైనా రాజ‌కీయ పార్టీ కానీ కూట‌మి కానీ కేంద్రంలో ప‌వ‌ర్లోకి రావాలంటే యూపీలో స‌త్తా చాటాలి. అప్పుడు మాత్రం కేంద్రంలో పాగా వేసేందుకు కుదురుతుంది.

ఈ లెక్క‌న చూస్తే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో కీల‌క పాత్ర‌ను యూపీ పోషిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. ఆ లెక్క‌న యూపీ రాజ‌కీయాల్లో శ‌క్తివంత‌మైన పార్టీలుగా చూసిన‌ప్పుడు కాంగ్రెస్‌.. బీజేపీ కాకుండా.. స‌మాజ్ వాదీ.. బ‌హుబ‌జ‌న స‌మాజ్ వాదీ పార్టీ కూడా నిలుస్తోంది. మొన్నామ‌ధ్య జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ.. బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీలు రెండు క‌లిసి పోటీ చేయ‌టంతో రాష్ట్రంలో అధికార‌ప‌క్ష‌మైన బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ త‌గిలింది.

ఇదే జోరును రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌ద‌ర్శించాల‌ని భావిస్తోంది స‌మాజ్‌వాదీ.. బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీలు. ఇలాంటి వేళ‌.. యూపీకి సంబంధించి కేసీఆర్ టూర్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న భేటీ కావాల్సిన ముఖ్య‌నేత‌ల్లో ములాయం.. అఖిలేశ్ తో పాటు మాయావ‌తికూడా ఉంటారు. ఈ మ‌ధ్య‌నే మంత్రి కేటీఆర్ ను పంపి మ‌రీ త‌న‌తో మాట్లాడేందుకు అఖిలేశ్ ను హైద‌రాబాద్ కు రావాల‌ని కోరిన‌ట్లుగా చెబుతారు. మిగిలిన రాష్ట్రాల‌కు త‌న‌కు తానే వెళ్లిన కేసీఆర్‌.. యూపీకి మాత్రం తాను వెళ్ల‌కుండా అఖిలేశ్ ను ఎందుకు పిలుస్తున్న‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

పిన్న‌వ‌య‌సులోనే సీఎంగా బాధ్య‌త‌లు చేపిన ట్రాక్ రికార్డు ఉన్న అఖిలేశ్ కు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న్ను క‌లిసేందుకు కేసీఆర్ కానీ ప్ర‌త్యేకంగా యూపీకి వెళితే మంచి సంకేతాలు ఇచ్చిన‌ట్లు అవ్వ‌ద‌ని.. వ‌య‌సులో చిన్న వాడైన‌ప్ప అఖిలేశ్ హైద‌రాబాద్ వ‌స్తే బాగుంటుద‌న్న సూచ‌న‌తో రాయ‌బారాన్ని న‌డిపిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. అఖిలేశ్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం విప‌క్షంగా ఉన్న ఆయ‌న‌.. జాతీయ స్థాయిలో కూట‌మిగా ఏర్ప‌డి మోడీకి చెక్ పెట్టాల‌న్న ఉత్సాహంతో కేసీఆర్ పంపిన సందేశానికి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యార‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే మిగిలిన వారి ద‌గ్గ‌ర‌కు తానే స్వ‌యంగా వెళ్లిన కేసీఆర్‌.. యూపీ విష‌యంలో మాత్రం అందుకు రివ‌ర్స్ గా సీన్ ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. ఇందులో నిజం పాళ్లు ఎంత‌న్న‌ది కాల‌మే బ‌దులివ్వాలి.
Tags:    

Similar News