కవిత ఓటమి వెనుక అసలు కథ ఇదే..

Update: 2019-07-05 11:10 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత ఓటమి టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులను షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి తర్వాత కేసీఆర్ చేయాల్సిన చాలా పనులను వాయిదా వేశాడట.. నామినేటెడ్ పోస్టుల భర్తీ సహా నిజామాబాద్ లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు బ్రేక్ వేశాడట.. నిజామాబాద్ ఎంపీగా అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి గెలవడం వెనుక ఇన్నాల్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం పనిచేసిందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇక టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల హస్తం కూడా ఉందన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.

అయితే తాజాగా కేంద్రంలోని బీజేపీ అధిష్టానాన్ని బీజేపీ నిజామాబాద్ ఎంపీ కలిసినప్పుడు వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్టు సమాచారం. జగన్ గెలుపు కోసం కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ బృందం ఇలా ఒక ఎంపీ గెలుపు కోసం పనిచేయదని.. ఒక రాజకీయ పార్టీ  తరుఫున మాత్రమే వారు పనిచేస్తారని చర్చ కొచ్చిందట.. మరి నిజామాబాద్ లో ఎలా గెలిచామని ఆరాతీయగా.. సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.

నిజామాబాద్ ఎంపీగా గెలవడానికి అరవింద్ వ్యూహాత్మకంగా అడుగులు వేశాడట.. కొంత మంది యువకులు జీతాలు ఇచ్చి మరీ ఒక టీంలాగా తయారు చేసి బృందాలు బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేసి ముందుకెళ్లాడట.. వారు రైతులు, ఇతర వర్గాల ప్రభావితం చేసేలా కార్యచరణతో ముందుకు వెళ్లినట్టు సమాచారం.

ఇలా అరవింద్ సొంత టీములే కల్వకుంట్ల కవిత కొంప ముంచాయని ఢిల్లీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏడుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు నిజామాబాద్ పరిధిలో గెలిచినా అరవింద్ సొంత టీం వ్యూహాత్మకంగా కదిలిన తీరే ఆయన విజయానికి కారణమైందన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.

   

Tags:    

Similar News