ఐక్యరాజ్యసమితి జనరల్ బాడీ మీటింగ్ లో ప్రసంగించనున్న ప్రధాని మోడీ.. దాని కంటే ముందే అమెరికాలో పలు వేదికల మీద మాట్లాడనున్నారు. అందులో భాగంగా తన తొలి సభను భారీ ఎత్తున ఏర్పాటు చేయటమే కాదు.. ఈ సభ ప్రపంచంలోని పలు దేశాలు ఆసక్తిగా చూసేలా చేశారు. హోడీ మోడీ పేరుతో టెక్సాస్ లో నిర్వహిస్తున్న ఈ సభ వెనుక సీరియస్ వ్యూహం ఉందన్న మాట వినిపిస్తోంది.
భారతీయ అమెరికన్లతో పాటు.. అమెరికా అధ్యక్షుడు.. పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్న ఈ సభ టెక్సాస్ చరిత్రలో కచ్ఛితంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. దాదాపు 50వేలకు పైనే ప్రజలు ఈ సభలో పాల్గొంటారని చెబుతున్నారు. అంత పెద్ద అమెరికా దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నా.. ఏరి కోరి టెక్సాస్ నే ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడే భారీ సభను ఏర్పాటు చేశారు? ఆర్టికల్ 370 నిర్వీర్యం చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత అమెరికాలో నిర్వహిస్తున్న బహిరంగ సభ టెక్సాస్ లోనే ఎందుకు? అన్న ప్రశ్నలు వేసుకుంటే ఆసక్తికర అంశాలే కాదు.. కొత్త కోణంలో విషయాల్ని చూసే అవకాశాల్ని ఇస్తుందని చెప్పాలి.
భారత్ కు కశ్మీర్ ఎలాంటిదో.. అమెరికాకు టెక్సాస్ అలాంటిదే. విస్తీర్ణ పరంగా.. జనసాంద్రత పరంగా అమెరికాలో రెండో అతి పెద్ద రాష్ట్రమైన టెక్సాస్ చరిత్రను చూస్తే.. ఇంచుమించు కశ్మీర్ ఇష్యూను పోలి ఉన్నట్లు కనిపిస్తుంది. దాదాపు 200 ఏళ్ల వెనక్కి వెళితే కాని విషయం పూర్తిగా అర్థం కాదు. 1821లో స్పెయిన్ వలస పాలన నుంచి మెక్సికో విముక్తి పొందింది.
అప్పట్లో మెక్సికోలోని భాగం ఇప్పటి టెక్సాస్. మెక్సికో నుంచి విడిపోయి తనను తాను స్వతంత్ర దేశంగా 1836లో రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ పేరుతో ఏర్పాటైంది. అయితే.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో 1845లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చేరటానికి ఓకే చెప్పింది. ఇది కాస్తా అమెరికా.. మెక్సికో మధ్య యుద్దానికి కారణమైంది. ఈ యుద్ధంలో కాలిఫోర్నియా.. న్యూ మెక్సికో సిటీలను అమెరికా తన అధీనంలోకి తెచ్చుకోవటం గమనార్హం.
కశ్మీర్ చరిత్రను చూస్తే.. టెక్సాస్ ను పోలి ఉండటం కనిపిస్తుంది. ఆర్టికల్ 370 నిర్వీర్యంతో కశ్మీర్ పూర్తి స్థాయిలో భారత్ లో కలిసిపోవటం తెలిసిందే. పాక్ అక్రమిత కశ్మీర్ విషయంలోనూ మోడీ సర్కారు స్పష్టంగా ఉంది. కశ్మీర్ ఇష్యూను శాశ్వితంగా క్లోజ్ చేసే దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా అంతర్జాతీయంగా మద్దతు సాధించేందుకు మోడీ తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కశ్మీర్ ఇష్యూపై అదే పనిగా రచ్చ చేస్తున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఇలాంటివేళ.. కశ్మీర్ కు సంబంధించిన ఇష్యూలను ఒక కొలిక్కి తీసుకురావాలన్న సంకల్పంలో మోడీ ఉన్నారు.
ఇందులో భాగంగా భారత్ కు కశ్మీర్ మాదిరే.. అమెరికాకు టెక్సాస్ అన్న విషయాన్ని గుర్తుకు వచ్చేలా చేయటమే తాజా సభ ఏర్పాటుకు ఒక కారణంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సభకు ట్రంప్ ఎందుకు హాజరవుతున్నారన్న విషయంలోకి వెళితే.. అందులోనూ రాజకీయ వ్యూహం ఉందని చెప్పక తప్పదు. త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని భావిస్తున్న ట్రంప్.. అందుకు తగ్గ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు.
ఇంతకీ టెక్సాస్ లోని హోడీ మోడీ సభకు ట్రంప్ రావటం వెనుక కారణం.. ఆయనంటే టెక్సాస్ ప్రజలకు వ్యతిరేకత ఉంది. అదే సమయంలో మోడీ అంటే సానుకూలత ఉంది. దీనికి కారణం.. టెక్సాస్ లో పెద్ద ఎత్తున భారతీయులు ఉండటమే. మోడీ సానుకూలతను తనకు అనుకూలంగా మార్చుకునే క్రమంలోనే ట్రంప్ ఈ సభకు హాజరు కానున్నట్లు చెప్పక తప్పదు. వాణిజ్య పరంగా భారత్ తో చక్కటి సంబంధాలు ఉన్నా టెక్సాస్ కంపెనీలు.. అక్కడి ప్రజల్లో మోడీకి ఉన్న పలుకుబడిని తన ఖాతాలోకి బదిలీ చేసుకునే క్రమంలోనే ఈ సభకు ట్రంప్ హాజరవుతున్నారని చెప్పక తప్పదు. లేకుంటే.. భారత ప్రధాని పాల్గొనే భారీ సభకు ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడు ఏరి కోరి వస్తారా ఏంటి?