ఉన్న ఫలంగా మాయావతి మీద ప్రేమ పుట్టుకొచ్చింది జనసేన అధిపతి పవన్ కల్యాణ్. అంతే కాదు.. ఏపీ - తెలంగాణ ల్లో బీఎస్పీతో పొత్తు అని కూడా పవన్ కల్యాణ్ ప్రకటించారు. పొత్తు సరే.. ఇంతకీ ఏపీలో అయితేనేం - తెలంగాణలో అయితేనేం.. బీఎస్పీ ఎక్కడ ఉంది? అనేది ఒక నంబర్ ప్రశ్న.
కనీసం ఉనికి కూడా లేదు. ఎక్కడో ఉత్తరాది పార్టీ. అక్కడి సమీకరణాలకు సంబంధించి పార్టీ బీఎస్పీ. అక్కడ కూడా ఆ పార్టీ బాగా దెబ్బ తింది. సొంతంగా రాజ్యసభకు నామినేట్ కాలేక మాయవతి ఇతర పక్షాల సాయం ఆశించారు. అదీ ఆ పార్టీ పరిస్థితి. బీజేపీ ధాటికి తట్టుకోలేక మాయవతి ఎస్పీతో చేతులు కలిపారు. వీరి పొత్తు విచ్చుకుంటుందా - కుచ్చుకుంటుందా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే కానీ చెప్పలేం,
ఇక ఏపీలో మాయవతికి - బీఎస్పీకి ఉన్న గుర్తింపు ఏమిటో చెప్పనక్కర్లేదు. అలాంటి పార్టీతో పొత్తు అట. అది కూడా రెండు రోజుల్లో నామినేషన్లు అనే సమయంలో.. ఈ కథలు చెబుతూ ఉన్నాడు. ఇంతకీ అసలు కథ ఏమిటి.. అంటే.. ఇదంతా చంద్రబాబు నాయుడుకు మేలు చేసే ప్రక్రియే అని వార్తలు వస్తున్నాయి.
మాయావతి పేరు చెప్పి దళిత ఓటు బ్యాంకును ఏపీలో కొంత వరకూ పొందాలని పవన్ ప్రయత్నిస్తూ ఉన్నాడు. తనను నమ్మి దళితులు ఓటేసే అవకాశాలు లేవని తెలిసే పవన్ ఇప్పుడు మాయావతి పేరును వాడుకొంటూ ఉన్నారు. అది కూడా తను గెలవడానికి కాదు.. జగన్ మోహన్ రెడ్డిని దెబ్బ తీసి - తెలుగుదేశం పార్టీకి సాయం చేయడంలో భాగంగా పవన్ కల్యాణ్ ఈ ఎత్తుగడను అనుసరిస్తూ ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు.
సాధారణంగా దళిత ఓటు బ్యాంకు చాలా వరకూ జగన్ వైపు ఉంది. దాన్ని ఎంతో కొంత జగన్ కు దూరం చేయడంలో భాగంగా.. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును అస్థిర పరిచి.. దాని వల్ల జగన్ కు లబ్ధి కలగకుండా - ఎంతో కొంత బాబుకు సాయం చేయడంలో భాగంగానే పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి ఈ దళిత వాదాన్ని ఎత్తుకున్నారని ప్రచారం జరుగుతూ ఉంది.
యూపీలో కనీసం సొంతంగా ఎంపీ సీట్లను గెలవలేని పరిస్థితుల్లో ఉన్న మాయవతిని ప్రధానిగా చూడాలని పవన్ కొత్త కలరింగ్ ఇవ్వడం దళిత ఓటు బ్యాంకును అస్థిర పరిచి చంద్రబాబుకు మేలు చేయడేమ తప్ప మరోటి కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ఇది మరీ అంత గొప్ప ఎత్తుగడ కాదు - సిల్లీ ఎత్తుగడ అని మాత్రం ఖాయంగా చెప్పవచ్చు. ఏపీలో మాయవతి పేరును చెబితే.. ఓటేసేది ఎవరు? అని!