అనుకున్నది చేయటం అందరూ చేసేదే. రాజకీయాల్లో అనుకున్న దాని కంటే అనూహ్యంగా జరిగే పరిణామాలకే ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బలంగా విశ్వసిస్తుంటారేమో. మొదట్నించి ఊహించని రీతిలో వ్యవహరిస్తూ.. భిన్నంగా నిర్ణయాలు తీసుకోవటంలో పవన్ కల్యాణ్ తర్వాతే ఎవరైనా. పవన్ సోదరుడు చిరు రాజకీయ పార్టీ ఏర్పాటు ముందు జరిగిన హడావుడిగా గుర్తుందా? అదే సమయంలో.. పవన్ తన రాజకీయ పార్టీని ప్రకటించే ముందు ఎంత సస్పెన్స్ నెలకొందో చూసిందే.
పేరుకు అన్నదమ్ములే అయినా.. చాలా విషయాల్లో వీరిద్దరి మధ్య వ్యత్యాసం భారీగా ఉంటుంది. ప్రతిది క్రమబద్ధంగా చిరు విషయంలో జరిగితే.. అనూహ్యంగా పరిణామాలు చోటు చేసుకోవటం పవన్ మార్క్ అలవాటుగా చెప్పక తప్పదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ జనసేన కార్యక్రమంలోకి తన కుటుంబ సభ్యులెవరినీ సీన్లోకి తీసుకురాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
అందుకు భిన్నంగా ఈ రోజు ఆయన తన సతీమణి అన్నాను తీసుకొచ్చారు. మొదటి భార్యతో విడాకుల అనంతరం.. సినీ నటి రేణు దేశాయ్ ను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించారు. కారణాలు ఏమైనా కానీ.. వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకోవటం ఒక సంచలనమైతే.. ఇది జరిగిన కొంతకాలానికే విదేశీ మహిళ అయిన అన్నాను పవన్ పెళ్లాడటం అప్పట్లో సంచలనంగా మారింది.
తన మూడో పెళ్లి వివరాల్ని పవన్ కల్యాణ్ గోప్యంగా ఉంచినప్పటికీ.. ఆయన పెళ్లి వివరాల్ని తర్వాతి కాలంలో మీడియా కారణంగా బయటకు వచ్చాయి. పవన్ మూడో పెళ్లి పెను సంచలనంగా మారటంతో పాటు.. ఆయన్ను తప్పు పట్టే వారు.. దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం షురూ చేశారు. తన పార్టీ ప్రకటన సందర్భంగా మాట్లాడిన పవన్.. తాను కొందరు రాజకీయ నేతల మాదిరి రహస్య సంబంధాలు పెట్టుకోవటం లేదని.. ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నట్లుగా చెప్పారు.
పవన్ ను టార్గెట్ చేయాలని భావించే వారు.. ఆయన పెళ్లిళ్లపై విమర్శలు చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇదే సమయంలో పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ను పవన్ అభిమానులు ఇంకా వదినగా ఫీల్ కావటం లాంటివి ఈ మధ్యన ఇబ్బందికర పరిణామాలుగా మారాయి. తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా రేణు ప్రకటించిన వెంటనే ఆమెపై పవన్ అభిమానులు కస్సుమన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టటంతో పాటు.. తన భార్యను తానెంత బాగా చూసుకుంటానన్న విషయాన్ని లోకానికి తెలియజేయటంతో పాటు.. ఆమె తనకెంతో ముఖ్యమో పవన్ చెప్పాలనుకున్నారా? అంటే.. అవుననే మాటను చెబుతున్నారు.
ఈ వాదనకు బలం చేకూర్చేలా గడిచిన రెండు రోజులుగా పవన్ తనతో పాటు తన సతీమణిని తన వెంట తీసుకెళ్లటం ఆసక్తికరంగా మారింది. నిన్నటి సికింద్రాబాద్ లోని చర్చికి విదేశీ ప్రతినిధిని కలుసుకునేందుకు తన సతీమణితో వెళ్లిన పవన్.. తాజాగా తన తెలంగాణ పర్యటనకు ముందు పార్టీ ఆఫీసుకు తాను వెంట పెట్టుకొచ్చారు. అంతేనా.. సంప్రదాయ పద్దతిలో తనకెదురుగా రావాలని కోరటంతో పాటు.. వీర తిలకం దిద్దించుకోవటం.. దిష్టి తీయించటం లాంటి కీలక అంశాలు ఆమెతో చేయించారు.
ఎందుకిలా? ఇప్పటివరకూ తాను వేరు.. తన కుటుంబం వేరు అన్నట్లుగా వ్యవహరించిన పవన్.. ఇప్పుడు అన్నాను ఎందుకు సీన్లోకి తీసుకొచ్చారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాల్ని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఏపీ పర్యటనకు భిన్నంగా తెలంగాణ పర్యటన సాగుతుందని.. భవిష్యత్తులో తాను చేసే పర్యటనలకు.. రాజకీయాలకు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగటం ఖాయమని.. వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా తన భార్యను తెర మీదకు తెచ్చారని చెబుతున్నారు. మూడో పెళ్లి చేసుకోవటం పూర్తిగా తన వ్యక్తిగత అంశమైనా.. అన్నాను లోకానికి సరిగా పరిచయం చేయకపోవటం వల్ల నెగిటివ్ అయ్యిందని.. దాన్ని ఇప్పటికైనా సరి చేయాల్సిన అవసరం ఉందన్న సన్నిహితుల మాటకు పవన్ ఓకే అన్నారని చెబుతున్నారు.
వాస్తవానికి పవన్ తన రాజకీయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల్ని తీసుకురావటం సుతారం ఇష్టం ఉండదని.. కానీ అన్నా విషయంలో ఫ్యూచర్లో ఎదుర్కొనే విమర్శలకు చెక్ చెప్పటంతో పాటు.. తమ అనుబంధంపై పార్టీ క్యాడర్లోనూ.. తన అభిమానుల్లో ఉన్న సందేహాలకు అన్నాను బయటకు తీసుకురావటం ద్వారా సమాధానాలు లభించేలా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఎలాంటి కీలక భూమిక అన్నా పోషించకుండా.. పవన్ సతీమణిగా ఆమెంత పర్ ఫెక్ట్ అన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయటమే పవన్ లక్ష్యమని.. అందుకు తగ్గట్లే తాజా ఎంట్రీ అని చెప్పక తప్పదు.